డైరెక్టర్స్ ఇంటలిజెన్స్, వీళ్ళకి మాత్రం అర్ధం కావట్లేదు.!

14 Reels Loosing

14 Reels Loosing Because of Directors

రెండు రోజుల క్రితం విడుదలైయినా “లై” మిక్స్డ్ రివ్యూస్ తో థియేటర్స్ లో ప్రదర్శితమవుతున్న సంగతి తెల్సిందే. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయినా ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులని మెప్పించ లేక పోయింది. సినిమా మొత్తం ఆసక్తిగా కూర్చొన్న ప్రేక్షకుడు క్లైమాక్స్ తరువాత  ఒకింత నిరుత్సాహ పడక తప్పదు. సినిమా ని చాలా ఇంటెలిజెంట్ గా తీయాలి అనే ఉద్దేశం తో ప్రేక్షకులని కూడా చాలా ప్రశ్నలతో సినిమా నుంచి బయటకు పంపించారు చిత్ర బృందం.

ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే చాల రోజుల క్రితం రిలీజ్ అయ్యిన మహేష్ బాబు 1 కూడా ఇలానే ఇంటెలెజెంట్ గా తీశారు. కానీ అప్పుడు కూడా ప్రేక్షకులని మెప్పించలేక పోయింది. ఇప్పుడు కూడా పరిస్థితి అలానే ఉంది. అసలు సినిమా తీసేది మేకర్స్ సంతృప్తి కోసమా? లేక చూసే ప్రేక్షకుల కోసమో, ఒక్కసారి ఆలోచిస్తే ఇలాంటి సమస్యలు ఉండవు. మన సినిమా రీచ్ వేరు, మన ప్రేక్షకుల అభిరుచి వేరు. ఎదో కొంతమందిని మెప్పించాలి అంటే దానికి తగ్గట్టు కాస్టింగ్ దానికి తగ్గ బడ్జెట్ తో ముందుకు రావాలి. హీరోస్ బట్టి మార్కెట్ చేస్తే అందరిని మెప్పించే విధంగానే సినిమా లు తీయాలి. ఇంటిలెజెన్స్ మనకుంటే పర్లేదు కానీ, సినిమా ను ప్రేమించే ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తే మాత్రం తీర్పు వేరే విధంగా ఉంటుంది. చాల కాస్టలీ గా నిర్మించిన ఈ రెండు సినిమాలును ప్రొడ్యూస్ చేసింది మాత్రం 14 Reels. డైరెక్టర్స్ ఇంటెల్లజెన్సు ఏమో కానీ, మేకింగ్ లో ఇంత ఫ్రీడమ్ ఇచ్చిన వీళ్లకి మాత్రం జేబులు కాళీ అవుతున్నాయి.

Like Us:  https://www.facebook.com/GoldScreenOfficial/

LEAVE A REPLY