ప్రభాస్ రేంజ్ పెంచేస్తున్నారు..!!

బాహుబలి తర్వాత ప్రభాస్ చేయబోయే తర్వాతి సినిమాకి రంగం సిద్ధం అయ్యింది..ఈ నెలాఖరుకి బాహుబలి సినిమాలో తన పని ముగించుకుని కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత కొత్త ఏడాదిలో తన కొత్త సినిమాను మొదలుపెట్టబోతున్నాడు ప్రభాస్‌. రెండేళ్ల కిందటే ప్రభాస్‌ తన తర్వాతి సినిమాను రన్‌ రాజా రన్‌ ఫేమ్‌ సుజిత్‌తో కమిటైన సంగతి తెలిసిందే. ఈ సినిమా అనుకున్న సమయానికి దాని రేంజ్‌ తక్కువే. కానీ గత రెండేళ్లలో బాహుబలి పుణ్యమా అని ప్రభాస్‌ ఇమేజ్‌ అమాంతం పెరిగిపోయింది. అతను నేషనల్‌ స్టార్‌ అయిపోయాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్‌ బాగా పెరిగింది.

వంద కోట్లకు పైగా బడ్జెట్లో త్రిభాషా చిత్రంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. తెలుగుతో పాటు హిందీ.. తమిళ భాషల్లోనూ ఈ చిత్రం తెరకెక్కనుంది. అందుకే అన్ని ఇండస్ట్రీలకూ పరిచయ మున్న సంగీత దర్శక త్రయం శంకర్‌-ఎహసాన్‌- లాయ్‌ లను ఈ సినిమాకు ఎంచుకున్నట్లు సమాచారం. ఈ ముగ్గురూ హిందీలో ఎన్నో మ్యూజికల్‌ హిట్లు ఇచ్చారు.తెలుగులోనూ కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాతో ఆకట్టుకున్నారు. ప్రభాస్‌ సినిమా కోసం చాలా మందిని పరిశీలించి.. చివరికి ఈ ముగ్గురికే సంగీతం బాధ్యతలు అప్పగించాడు సుజిత్‌. జేమ్‌స బాండ్‌ తరహా యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్క బోయే ఈ చిత్రాన్ని యువి క్రియేషన్‌స నిర్మించనుంది.