మెగా ట్రైలర్ లో 7 పొరపాట్లు..!!

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెం.150’. సంక్రాంతి కానుకగా ఈ నెల11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే విజయవాడ – గుంటూరు మధ్యలో ‘హాయ్ ల్యాండ్’ ఎమ్యూజ్ మెంట్ పార్క్ లో మెగా ఖైదీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ అదిరిపోయే రేంజ్ లో జరిగింది.. దర్శక రత్న దాసరి నారాయణ రావు ముఖ్య అతిధిగా మెగా హీరోల మధ్య అంగరంగ వైభవం గా ఫంక్షన్ జరిగింది. ఈ సందర్భంగా విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా, చిరు యాక్షన్ ఎపిసోడ్స్ లో అద్భుతంగా నటించారని పేర్కొన్నారు.. అయితే ఈ ట్రైలర్ లో కొన్ని కొన్ని మిస్టేక్స్ కనిపించాయి.. అయితే అది పోస్ట్ ప్రొడక్షన్ పరంగా.. అవేంటో ఒక సారి చూద్దాం.

ఓ వైపు రైతు లను ఉద్దేశించి చిరు ఎంతో ఉద్వేగంగా డైలాగ్ చెప్తుంటే పక్కనే నిలబడ్డ కాజల్ నవ్వుతున్నట్లు కనిపిస్తుంది..

ఈ ఫోటో లో కనిపిస్తున్న యాక్సిడెంట్ తమిళ చిత్రం నుంచి కాపీ కొట్టింది గా కనిపిస్తుంది.. చుట్టూ కనిపిస్తున్న ఆ పరిసరాలు అక్కడ షాట్ లో ఇక్కడ షాట్ లో సేమ్ కనిపించడం విశేషం..

మాములుగా కోర్ట్ లో ఇందిరాగాంధీ ఫోటో పెట్టరు.. మరి ఈ ఫోటో పెట్టడం వెనుక ఆంతర్యం ఏమిటో మరీ..


ఎడిటింగ్ ఎంత అశ్రద్ధ గా ఉందో ఈ ఫోటో చూస్తే తెలుస్తుంది.. గ్రాఫిక్స్ లో మనుషులను క్రియేట్ చేస్తే చేసారు కానీ అది కొంచెం శ్రద్ధ తో వచ్చిన వారిని రిపీట్ చేయకుండా క్రియేట్ చేస్తే బాగుండేది..