ఇక శాతకర్ణి పై నే అందరి దృష్టి..!!

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సంక్రాంతి సమరం వచ్చేసింది.. ఈ సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణలు తమ తమ సినిమాలతో పోటీపడుతున్న సంగతి తెలిసిందే.. చిరు ఖైదీ నెంబర్ 150 , బాలకృష్ణ గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాలతో దాదాపు 13 ఏళ్ళ పోటీపడుతున్నబాక్సాఫిస్ వద్ద పోటీ పడుతున్న ఈ రెండు సినిమాల్లో ఏది ఘన విజయం సాధిస్తుందో అని అటు అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా చూస్తున్నారు. చిరు సినిమా ఈ రోజు రిలీజ్ అవగా ఆ సినిమా ఎబోవ్ యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది..దాదాపు 4500 థియేటర్లలో ఈ సినిమా విడుదల అవగా సంక్రాంతి బరిలో నిలిచిన మొదటి సినిమా కావడంతో, చిరంజీవికి అత్యంత ప్రతిష్టాత్మక సినిమా కావడంతో అందరి చూపు ఖైదీ నెం.150 పైనే పడింది..

అనుకున్నట్లుగానే సినిమా మంచి టాక్ తెచ్చుకుంది.. ఇందులో చిరు నటనకి మంచి మార్కులు దక్కగా, డాన్సులు, ఫైట్స్ ఇరగదీసాడంటూ ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు..ఇక అందరి దృష్టి శాతకర్ణి పైనే ఉంది.. చిరు సంక్రాంతికి వచ్చి పర్వాలేదనిపించుకోగా బాలయ్య ఎం చేస్తాడో అని అందరు ఎదురు చూస్తున్నారు.. రేపే ప్రపంచవ్యాప్తంగా రాబోతున్న ఈ సినిమా ఈ సినిమా శాతవాహన మహారాజు “శాతకర్ణి” జీవితం ఆధారంగా క్రిష్ తెరకెక్కించాడు..ఈ సినిమా విజయం తథ్యం అని నందమూరి అభిమానులే కాక యావత్ తెలుగు సినిమా అభిమానులను చెప్పడం విశేషం.. మరి శాతకర్ణి వ్యవహారం ఎలా ఉంటుందో రేపు చూద్దాం..