శాతకర్ణి లో అనసూయ కూడా..!!

నందమూరి బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. ఈ సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుజాతి ఔనత్యాన్ని, గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప తెలుగు చక్రవర్తి ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ జీవిత గాధ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది.ఈ చిత్రంలో బాలయ్య సరసన శ్రియా జతకట్టనుంది. తల్లిగా అలనాటి హీరోయిన్ హేమ మాలిని నటించనుంది. ఈ చిత్రానికి సంగీతం చిరంతన్ భత్. వై. రాజీవ్‌రెడ్డి, సాయిబాబు నిర్మాతలు.

అయితే ఈ సినిమాలో హాట్‌ యాంకర్‌ అనసూయ కూడా ఓ పార్ట్ అయినట్లు స్వయంగా ఆమె తెలిపింది.. ఈ సినిమాలో వచ్చే  ఫరా కిరిమి అనే ఓ  పాత్ర కోసం ఫారిన్‌ యాక్సింట్‌తో కూడిన తెలుగు డైలాగులు చెప్పను. ఆ డైలాగులు చెబుతుంటే నేను పరిశ్రమలోకి వచ్చిన రోజులు గుర్తుకొస్తున్నాయి. కెరీర్ ఆరంభంలో అల్లు అర్జున్‌ నటించిన ‘వేదం’ సినిమాలో దీక్షా సేథ్‌ పాత్రకు డబ్బింగ్‌ చెప్పింది అనసూయే. ఈ చనువుతోనే క్రిష్ మళ్ళీ ఈ విధం గా ఆఫర్ ఇచ్చాడట..  మొత్తానికి ‘శాతకర్ణి’ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాన’ని చెప్పింది అనసూయ.