బాహుబలి పోస్ట్ పోన్ అవుతుందా..!!

బాహుబలి పోస్ట్ పోన్ అవుతుంది.. ఇప్పుడిదే టాలీవుడ్ లో హాట్ టాపిక్.. అయితే సినిమా రిలీజ్ కాదండోయ్.. ట్రైలర్.. తాజాగా బాహుబలి 2 ట్రైలర్ మరింత ఆలస్యంగా రానుందని చిత్రబృందం ప్రకటించింది. ప్రస్తుతం ఈ నెల 25న బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ చేతుల మీదుగా ‘బాహుబలి 2’ ట్రైలర్ రిలీజ్ కానుందని, షారుఖ్ ‘రాయీస్’ థియేటర్ లో బాహుబలి ట్రైలర్ సందడి చేయనుందనే ప్రచారం జరిగింది.

ఈ ప్రచారంపై బాహుబలి చిత్రబృందం స్పందించింది. బాహుబలి 2 ట్రైలర్ రిలీజ్ డేట్ ని ఇప్పటి వరకు నిర్ణయించలేదని.. ఒకవేళ ఆ డేట్ ని నిర్ణయిస్తే చిత్రబృందం స్వయంగా ప్రకటిస్తుందని తెలిపారు. తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన బాహుబలి కి సీక్వెల్ గా వస్తున్న ‘బాహుబలి 2’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ 28న బాహుబలి 2 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.దర్శకధీరుడు రాజామౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న బాహుబలీ సీక్వెల్ లో ప్రభాస్, అనుష్క్, రానా, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్.. తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఎం.ఎం. కీరవాణి.