రివ్యూ : గౌతమి పుత్ర శాతకర్ణి

నటీనటులు : బాలకృష్ణ, శ్రియ, హేమమాలిని,శివ రాజ్‌కుమార్
మాటలు : సాయి మాధవ్ బుర్రా
సినిమాటోగ్రఫీ : VS జ్ఞాన శేఖర్
మ్యూజిక్ : చిరంతన్ భట్
డైరెక్టర్ : రాధాకృష్ణ జాగర్లమూడి (క్రిష్)
ప్రొడ్యూసర్ : సాయిబాబు జాగర్లమూడి, వై. రాజీవ్ రెడ్డి
విడుదల తేదీ : 12 జనవరి 2017

నందమూరి బాలకృష్ణ 100 వ చిత్రంగా , క్రిష్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి.. శాతకర్ణి భార్య వశిష్టాదేవిగా శ్రియా కనిపించబోతోంది. శాతకర్ణి తల్లి గౌతమిగా అలనాటి హీరోయిన్ హేమ మాలిని నటించనుంది. ఇప్పటికే రిలీజైన ఈ చిత్రం ట్రైలర్స్, టీజర్స్ లో బాలయ్య వీరత్వం, పాత్రల గొప్పదనం స్పష్టంగా కనిపించింది. చిరంతన్ భట్ అందించిన పాటలు వీణులవిందుగాగా ఉన్నాయి. సాయి మాధవ్ బుర్రా డైలాగులు భలే పేలాయి. మరి ఈ సినిమాతో బాలయ్య వీరత్వం ప్రేక్షకులని ఏ మేరకు మెప్పించింది.అనేది తెలుసుకోవాలంటే ఈ సమీక్షలోకి వెళ్లాల్సిందే..

కథ విషయానికొస్తే

తెలుగుజాతి ఔనత్యాన్ని, గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప తెలుగు చక్రవర్తి ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ జీవిత గాధ ఆధారంగా తెరకెక్కిన చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి.. క్రీ.శ. 1-2 కాలానికి చెందిన ఈ కథ లో భారతదేశం ఒక్క తాటిపై కాకుండా చిన్న చిన్న గణతంత్ర రాజ్యాలుగా ఉండేవి.. అప్పటి రాజులూ తమ రాజ్యాన్ని పట్టించుకోకుండా రాజ్యపాలన కొనసాగిస్తున్నారు..

Prev1 of 2