చైతు, రానా ల సినిమాకి ముహూర్తం కుదిరింది…!!

అక్కినేని నాగ చైతన్య 2016 లో వరుసగా రెండు హిట్స్ కొట్టి ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మరో సినిమాతో హిట్ కొట్టడానికి రెడీ గా ఉన్నాడు.. అయితే గతంలో రానా నిర్మాతగా చైతు ఓ సినిమా చేస్తాడనే వార్తలు వచ్చాయి..హీరోగా పలు సినిమాలతో బిజీగా వున్న రానా దగ్గుబాటి నిర్మాతగా సినిమాలు చేయాలనే కోరికను ఇటీవల తనే స్వయంగా ప్రకటించాడు. అయితే తాజా సమాచారం ప్రకారం రానా  నిర్మించే తొలి చిత్రంలో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తాడని అంటున్నారు..

నూతన దర్శకుడుఆర్.వి. మరిముత్తు ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కాగా, ఈ చిత్రం ఓపెనింగుకి తాజాగా ముహూర్తం నిర్ణయించారు. ఈ నెల 29న చిత్రం షూటింగును హైదరాబాదులో లాంఛనంగా ప్రారంభిస్తారని సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మాణం జరుపుకునే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.