చిరు బయోపిక్ రెడీ అవుతుంది..!!

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెం.150’. ఈ చిత్రం రేపే విడుదల అవుతుండడంతో అందరిలో ఆకక్తి కలుగుతుంది.. ఇప్పుడు మెగాస్టార్ 151వ చిత్రంపై విస్తృతమైన చర్చ మొదలైంది.రాంచరణ్ నిర్మించబోయే తదుపరి చిత్రం కూడా మెగాస్టార్ చిరంజీవిదేనని స్పష్టంకావడంతో ఆ చిత్రం ఏదై ఉంటుందా అని అభిమానుల్లో ఒకటే ఆతృత..అందుకు తగ్గట్లే మెగాస్టార్ 151వ చిత్రం గురించి కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ చిత్ర దర్శకులుగా బోయపాటి, సురేందర్ రెడ్డి, త్రివిక్రమ్.. పేర్లు గట్టిగా వినబడుతున్నాయి. అయితే, ఇవన్నీ అబద్దమట.

తన 151వ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి స్వయంగా స్పందించారు.150వ సినిమా కోసం కథలు వినే సమయంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథని విన్నాను. ఆ కథని తన 151వ చిత్రంగా తీయాలని అనుకొన్నాం. దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా ఓ కథని చెప్పారు. కథ నచ్చింది. ఈ రెండు చిత్రాల్లో ఏదో ఒకటి తన 151వ చిత్రంగా ఉండబోతుందని తెలిపారు మెగాస్టార్. ఇక, ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానున్న మెగాస్టార్ ఖైదీ నెం.150 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వివి. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చిరు సరసన కాజల్ జతకట్టనుంది. లక్ష్మీ రాయ్ ఐటమ్ సాంగ్ లో మెరవనుంది. ఈ చిత్రానికి సంగీతం దేవీ శ్రీ ప్రసాద్. రాంచరణ్ నిర్మాత.