బోయపాటి , త్రివిక్రమ్ లను పక్కన పెట్టిన చిరు..!!

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెం.150’. ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే చిరు అప్పుడే తన తదుపరి చిత్రం పై దృష్టి పెట్టాడని తెలుస్తుంది.. ఆ సినిమాని  దర్శకుడు క్రిష్ తో చేయనున్నాడు అనే వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హల్ చల్ చేస్తోంది. రాంచరణ్ నిర్మించబోయే తదుపరి చిత్రం కూడా మెగాస్టార్ చిరంజీవిదేనని స్పష్టంకావడంతో.. ఆ చిత్ర దర్శకుడు ఎవరు ? అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే చిరు 151 మూవీ రేసులో దర్శకులు బోయపాటి,త్రివిక్రమ్, సురేందర్ రెడ్డిల పేర్లు వినిపించాయి. కానీ చిరు క్రిష్ కె ఓటు వేసినట్లు తెలుస్తుంది.

అంతేకాదు ఇటీవల మెగా క్యాంప్ నుంచి క్రిష్ కి కబురు రావడం .. ఆయన చిరూకి ఓకే చెప్పడం జరిగిపోయాయని అంటున్నారు.త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడవచ్చనే టాక్ వినిపిస్తోంది. బాలయ్య వందో సినిమా ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ మెగా ఖైదీతో పాటుగా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ కి ముందే ఈ చిత్ర అవుట్ పుట్ ని చూసిన సినీ ప్రముఖులు క్రిష్ పనితనాన్ని అభినందిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఇటీవలే మెగా ఫ్యామిలీ నుంచి క్రిష్ కి కబరు వచ్చిందని అంటున్నారు..ఇదే నిజమైతే.. మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ గానూ ఉపయోగపడే ఓ సామాజిక అంశంతో క్రిష్ ప్రేక్షకుల ముందు రావొచ్చు.