ఆ టైటిల్ పెట్టింది ఎవరో చెప్పిన చిరు..!!

నిన్న ఘనంగా చిరు 150 వ సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరిగింది.. కోట్లాది మంది అభిమానుల సాక్షిగా, సినీ ప్రముఖుల మధ్య, యంగ్ హీరోల మధ్య, ఈ ఫంక్షన్ అంగరంగ వైభవంగా జరిగింది.. మెగాస్టార్ చిరంజీవి ఎంతో ఉద్వేగంగా ప్రసంగం చేశారు.. ఖైదీ నెంబర్ 150 సినిమాకు మేకప్ వేసుకునే మధ్య సమయం క్షణంలా గడిచిపోయిందని అన్నారు. అసలు ఈ సినిమాకి ఈ టైటిల్ ఎవరు పెట్టారో చెప్పేసారు.. ఖైదీ డ్రెస్‌లోవున్న తన స్టిల్ చూసి ఈ సినిమాకు ‘ఖైదీ నెంబర్ 150’ పేరు పెట్టండంటూ దాసరి నారాయణరావు సూచించారని, ఆయన సూచించినట్టే అదే పేరు పెట్టామని చిరంజీవి తన మనసులోని మాటను బయటపెట్టారు. ఈ పేరు సూచించినందుకు ఆయనకు ధన్యవాదాలని చెప్పారు. అభిమానుల ఈ కోలాహలం చూసి విజయవాడ కృష్ణానది పక్కన ఉన్నానా? లేక విశాఖ సముద్ర తీరాన ఉన్నానా? అన్న అనుమానం వస్తోందని అన్నారు చిరు.

మొన్నటివరకు ఎడముఖం.. పెడముఖంగావున్న దాసరి- చిరంజీవి, ఇలా ఆకాశానికి ఎత్తేయడం ఏమిటంటూ సోషల్ మీడియాలో చర్చించుకోవడం సినీలవర్స్ వంతైంది.ఇంకా ఈ వేడుకలో మంత్రులు కామినేని శ్రీనివాసరావు, పత్తిపాటి పుల్లయ్య, పరుచూరి బ్రదర్స్, అ్లల్లు అరవింద్, అల్లు అర్జున్, శిరీష్‌, రత్నవేలు, దేవీ శ్రీ ప్రసాద్, బ్రహ్మానందం, అశ్వినీ దత్, ఎన్.వి. ప్రసాద్, శరత్ మారార్, డి.వి.వి దానయ్య, అలీ, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి కి జనవరి 11 న  ఈ సినిమా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే..