అబ్బో మామూలు కుమ్ముడు కాదుగా..!!

మెగాస్టార్ నటిస్తున్న ‘ఖైదీ నంబర్ 150’ చిత్రం ప్రీ-రిలీజ్ తో సినిమా క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. సంక్రాంతి కానుకగా ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ కేవలం 3గం॥ల్లోనే మిలియన్ మార్క్ క్రాస్ చేసింది.థ్రియేట్రికల్ ట్రైలర్ లో యాక్షన్ తో నింపేశాడు. మెగాస్టార్ డైలాగ్స్ తో ఇరగదీశాడు. మొత్తంగా మాస్ ప్రేక్షకులని ఫుల్లుగా అలరించేలా సాగింది ట్రైలర్. ఇదే విషయాన్ని స్వయంగా మెగాస్టార్ చెప్పడం విశేషం.

మెగా ఖైదీలో యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ.. అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పుకొచ్చారు. అందుకే.. అభిమానులకి ఫుల్ మీల్స్ పెట్టేందుకు ‘కత్తి’ రిమేక్ ని ఎంచుకొన్నట్టు తెలిపారు. వీవీ వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ 100 కోట్లను దాటేయడం మరో రికార్డు. ఈ నెల 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మరెన్ని రికార్డులు నమోదు చేస్తుందో చూడాలి!