జబర్దస్త్ 200 నాటౌట్..!!

గతం నాలుగు సంవత్సరాలనుంచి జబర్దస్త్ సృష్టిస్తున్న సంచలనం అంతాఇంతాకాదు.. అన్ని వర్గాల ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ముందుకు దూసుకుపోతున్న ఈ షో ఇప్పటికీ నిర్విరామంగా నడుస్తుందంటే కారణం కొత్తదనాన్ని ప్రోత్సహించడమే.. ఐదు టీం లు చేసే జోక్స్, వేసే పంచెస్, జడ్జి ల మార్క్స్, యాంకర్ కామెంట్స్ కలిసి జబర్దస్త్ నిన్నటికి 200 వ ఎపిసోడ్ ని పూర్తి చేసుకుంది..

జడ్జెస్ నాగబాబు, రోజా, టీం మెంబర్స్,  టెక్నిషన్స్ అందరు కలిసి 200  వ ఎపిసోడ్ ని ఘనం గా సెలెబ్రేట్ చేసుకోగా ఇప్పటి వరకు ఏ టీవీ షో సాధించినంత రేటింగ్స్ ని సాధిస్తూ మరిన్ని ఎపిసోడ్స్ చేసే దిశగా ముందుకెళ్తుంది.. మల్లెమాల ప్రొడక్షన్స్ లో నిర్మితమవుతున్న ఈ షో ని నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తుండగా, నితిన్ – భరత్ లు డైరెక్ట్ చేస్తున్నారు.. ఈటీవీ లో ప్రతి గురు శుక్ర వారాల్లో రాత్రి 9 .30 ప్రసారమవుతున్న ఈ షో సినిమాలను సైతం మరిపిస్తుందనటంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు..