బాలాదిత్య ‘ ఛాంపియన్ ‘ అదుర్స్..!!

etv-championఅనుక్షణం ప్రేక్షకులను ఆనంద లోగిళ్ళలో విహరింప చేసే తెలుగింటి లోగిలి ఈ టీవీ.. సరికొత్త ప్రోగ్రామ్స్ తో మనందర్నీ అలరిస్తూ , నం1 సాగిపోతున్న ఈ టీవీ ఇప్పుడు చిన్నారుల కోసం అందించిన సరికొత్త ప్రొగ్రామ్ “ఛాంపియన్స్ “..పిల్లల మేధాశక్తిని మరింత పెంచి వారి కెరీర్లకు ఎంతగానో ఉపయోగ పడే ఈ షో లో అన్ని రకాల ప్రశ్నలు అడుగుతూ వారి ని మరింత ఆలోచింపేలా చేస్తుంది..

హైస్కూల్ స్థాయిలో విద్యార్థుల మేధస్సుని పరీక్షిస్తూ వారికి ఆకర్షనీయమైన బహుమతులను అందిస్తూ ప్రేక్షకాదారణ పొందుతుంది. బాలాదిత్య యాంకరింగ్ ఈ ప్రొగ్రామ్ కి హైలైట్ కాగా క్విజ్ పోటీగా ఈ షో చిన్నారుల ప్రతిభను వెలికి తీస్తుంది. ప్రతిరోజు సాయంత్రం 6గ.లకు ప్రసారమవుతూ మంచి రేటింగ్స్ సంపాదిస్తుంది. మురళీధర్ కేసరి ఈ షో కి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు..