ఇదీ కదా బాలయ్య బాబు సత్తా ..!!

తన వందో చిత్రంతో గౌతమి పుత్ర శాతకర్ణిగా హిస్టరీ రిపీట్ చేసేందుకు బరిలోకి దిగుతున్నాడు బాలయ్య. సెన్సార్ పనులను ముగించుకున్న ఈ సినిమా అన్ని హంగులతో సంక్రాంతి 12 న విడుదలకు రెడీ అయింది. అయితే ఈ సినిమాలోని కొన్ని హైలైట్స్ ని మనం ఇప్పుడు చూద్దాం. నందమూరి అందగాడు రాజు వేషం వేస్తే సినిమా థియేటర్లో కాసుల వర్షం కురుస్తుంది అనడంలో సందేహం లేదు. ఇప్పుడు చేస్తున్నది అందులోనూ బాలయ్య బాబు వందవ సినిమా ఎంతో ప్రెస్టేజియస్ గా దీనిని రూపొందించారు. ట్రైలర్ చూస్తుంటో డైరెక్టర్ క్రిష్ దీన్ని ఒక అద్భుతమైన కావ్యంగా మలచినట్లుగా కనిపిస్తోంది. హిస్టరీ బ్యాక్ డ్రాప్ లో అందూలోనూ అమరావతిని బేస్ చేస్కుని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన రాజు కథ ఇది. అందుకే అందరికీ ఇది కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలో ఎమోషనల్ సీన్స్ తారాస్థాయిలో చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది. ఇలాంటి సినిమాల్లో గ్రాఫిక్స్ , సెట్స్ చాలా కీలకం కాబట్టి వాటిపైన ఎక్కువగా దృష్టిపెట్టాడట క్రిష్. అందుకే డిసెంబర్ నెల అంతా కేవలం గ్రాఫిక్స్ కే కేటాయించి టైమ్ తీస్కున్నాడట.

గౌతమి పుత్రలో హృదయాన్ని హత్తుకునే సీన్స్ చాలా ఉన్నాయట. నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా కాబట్టి ఈ సినిమాలో స్పేస్ ని క్రియేట్ చేస్కుని దర్శకుడు తన ప్రతిభని చూపించబోతున్నాడు. ఇక బాలకృష్ణ రాజుగా , చక్రవర్తిగా, సైనికుడిగా, యుద్ధ వీరుడిగా చాలా షేడ్స్ లో కనిపించనున్నాడట. ముఖ్యంగా తన తల్లితో వచ్చే సీన్స్ సినిమాని రక్తి కట్టిస్తాయి అని చెప్తున్నారు. కొన్ని సన్నివేశాలు రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటాయని, అందులో బాలకృష్ణ యాక్టింగ్ సినిమాకే హైలెట్ అని తెలుస్తోంది.

శ్రీయతో మాట్లాడే పద్దతి, అటు అమ్మకోరిక తీర్చే తనయుడిగా బాలకృష్ణ అద్భుతమైన ప్రదర్శనని కనిపించాడని చెప్తున్నారు. అంతేకాదు, తన కొడుకుని భుజం పై వేస్కుని యుద్ధానికి వెళ్లే సీన్ సినిమాకే హైలెట్ అని ఆ సీన్ చూస్తుంటే థియేటర్ లో అందరూ సీట్లకి అతుక్కుపోయి మరీ చూస్తారని, రోమాంఛితంగా ఉంటుందని చిత్రయూనిట్ సభ్యుల నుంచి సమాచారం తెలుస్తోంది. అంతేకాదు, మిగతా యుద్ధ సన్నివేశాలు కూడ అద్బుతంగా వచ్చాయని, ముఖ్యంగా బ్రిటీష్, పోర్చు గీస్ వాళ్లతో వచ్చే సన్నివేశాలు, వందమంది సైనికులతో బాలయ్యబాబు పోరాడే సన్నివేశాలు థియేటర్స్ లో విజిల్స్ వినిపిస్తాయని చెప్తున్నారు. ఇక మరోవైపు వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ సినిమాని ఒక రేంజ్ లోకి తీస్కెళ్తాయని చెప్తున్నారు.

యుద్ధవ్యూహాలు, ప్రతి వ్యూహాలు అబ్బురపరిచేలా ఉంటాయని, ఒక వీరుడికి అందరూ ఎలా తల వంచారో చాలా చక్కగా చూపించాడట. సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ తో వచ్చే సీన్స్ పీక్స్ లో ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా శివరాజ్ కుమార్ పైన వచ్చే బుర్రకథ, ఆ తర్వాత బాలకృష్ణ వచ్చి ఎదిరించే సీన్స్ , అక్కడ వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా మలిచాడట క్రిష్. క్రిష్ తనలోని టాలెంట్ ని ఈసినిమా ద్వారా మరోసారి చూపించబోతున్నాడని, ధైర్యంగా నందమూరి అభిమానులు కాలర్ ఎగరేయచ్చని అంటున్నారు విశ్లేషకులు. ఈ సినిమా అన్ని కమర్షియల్ హంగులతో జనవరి 12వ తేదిన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే.