ఒళ్ళు గగుర్పొడిచే ఘాజి ట్రైలర్..!!

రానా – తాప్సీ జంటగా తెరకెక్కుతోన్న బాలీవుడ్ చిత్రం ‘ఘాజీ’. సంకల్ప్ దర్శకుడు. 1971లో భారత్-పాక్ ల మధ్య జరిగిన యుద్ధం నేపథ్యంలో తీసిన చిత్రమిది. పీవీపీ సినిమా బ్యానర్, మ్యాటినీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్త నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల అవుతుండగా,పీవీపీ సినిమా బ్యానర్, మ్యాటినీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్త నిర్మాణంలో వస్తుతన్ది.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 న దీన్ని రిలీజ్ చేయాలన్నది మేకర్స్ యోచన.

ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ నిన్న రిలీజ్ అయ్యింది.. ట్రైలర్ వాళ్ళు గగుర్పొడిచే విధంగా ఉందని చూసిన వారు అంటున్నారు.. 1971లో జరిగిన వార్ లో పాకిస్థాన్ నుంచి ఘాజీ అనే సబ్‌మెరైన్ విశాఖపట్నానికి నేరుగా వచ్చేసింది. దీంతో అలర్టయిన నౌకాదళం ఎలా ఆ నౌక ని అడ్డుకుని విజయం సాధించారనేదే సినిమా.. ఇప్పటివరకు ఈ తరహా కాన్సెప్ట్‌తో ఇండియాలో ఏ మూవీ రాలేదు.దాంతో ఈ సినిమాపై సహజంగా అందరిలో లంచాలు పెరిగాయి.. ఈ ట్రైలర్ తో మరిన్ని అంచనాలు పెరిగాయి..