ఊర మాస్ ట్రైలర్ వదిలిన గుంటూరోడు..!!

మంచు మనోజ్ కథానాయకుడిగా ‘గుంటూరోడు’ సినిమా తెరకెక్కింది. సత్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటించింది. వరుణ్ అట్లూరి నిర్మాణంలో సత్య తెరకెక్కించిన ఈ సినిమా ప్రేమను గెలిపించడానికి పోరాడే ఒక యువకుడు గా మనోజ్ నటిస్తున్నాడు. అయితే ముందు చెప్పినట్లుగానే ఈ రోజు ‘ ఈ  సినిమా నుంచి ట్రైలర్ ను వదిలారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీతో కూడిన సీన్స్ పై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. హీరోయిన్ ని చూసినప్పుడు తనలో కలిగిన ఫీలింగ్స్ ను హీరో తన ఫ్రెండ్ కి చెబుతుండగా ఈ ట్రైలర్ ను స్టార్ట్ చేశారు.

ప్రధాన పాత్రధారులందరినీ కవర్ చేస్తూ రూపొందించిన ఈ ట్రైలర్,సినిమాపై ఆసక్తిని పెంచేదిలానే వుంది. ఫిబ్రవరిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ చిత్రం ట్రైలర్ చూసి మీ అభిప్రాయం చెప్పండని అంటూ మనోజ్ ట్వీట్ చేశాడు. దాంతో పలువురి సెలెబ్రిటీలు సైతం సినిమా ట్రైలర్ బాగుందని చెప్తున్నారు.. కరెంట్ మూవీ లాగా ఈ చిత్రం సక్సెస్ కావాలని రకుల్ ప్రీత్ సింగ్ ట్వీట్ చేయగా. హీరో నిఖిల్ సిద్దార్థ్ కూడా మనోజ్ కు, ఈ సినిమా యూనిట్ కు కంగ్రాట్స్ చెబుతూ ట్వీటాడు.