గురు శాటిలైట్ అదుర్స్..!!

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం తమిళ, హిందీ భాషల్లో విజయవంతమైన చిత్రం సాలా ఖడూస్ చిత్రం ఆధారంగా తెరకెక్కుతున్న గురు సినిమాలో నటిస్తున్నారు .. బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో వెంకీ బాక్సింగ్ కోచ్ గా కనిపించబోతున్నారు. సుధా కొంగర దర్శకురాలు. రితిక సింగ్ హీరోయిన్.. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి కావొస్తోన్న ‘గురు’ వచ్చే యేదాది జననవరి 26న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా శాటిలైట్ హక్కులు భారీ రేటుకి అమ్ముడైనట్టుగా చెబుతున్నారు.

దాదాపు 5 కోట్ల రూపాయలకి జెమిని టీవీ వారు శాటిలైట్ హక్కులను దక్కించుకున్నారట. ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ తమిళ .. హిందీ భాషల్లో విజయాన్ని సాధించడంతో, తెలుగులోను సక్సెస్ ను సాధిస్తుందనే నమ్మకంతో వున్నారు. కంటెంట్ తో పాటు .. వెంకటేశ్ కి గల క్రేజ్ కూడా ఈ సినిమా శాటిలైట్ హక్కులు ఈ స్థాయిలో పలకడానికి కారణమని చెప్పుకుంటున్నారు.