వెంకీ ప్రపంచం అదేనట..!!

వెంకటేష్- రితికా సింగ్ జంటగా టాలీవుడ్‌లో రానున్న మూవీ ‘గురు’. ఇప్పటికే షూటింగ్ ఫినిష్ కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.సుధా కొంగర దర్శకురాలు. బాలీవుడ్‌లో హిట్టయిన ‘సాలా ఖడూస్‌’కి రీమేక్ గురు. స్పోర్ట్స్ నేపథ్యంలో సాగుతున్న ఈ చిత్రం లో బాక్సింగ్ కోచ్‌గా వెంకటేష్ కనిపిస్తున్నాడు..రితికాసింగ్‌ కీలక పాత్ర పోషించనుంది. ఈ చిత్రాన్ని రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న రిలీజ్ చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తోంది.

అయితే ఇదివరకే ఫస్ట్ లుక్ టీజర్లతో ఆకట్టుకున్న గురు ఈ సారి ట్రైలర్ తో సందడి చేస్తున్నాడు.. 41 సెకన్ల నిడివిగల ఈ వీడియోలో కోచ్‌గా విక్టరీ యాక్టింగ్ సూపర్బ్‌గా వుందని అంటున్నారు సినీలవర్స్. డైలాగ్స్ కూడా బాగున్నాయని, రితిక యాక్టింగ్, నాజర్ నటన ఆకట్టుకుందని చెప్తున్నారు. వైనాట్‌ స్టూడియోస్‌ సంస్థ చిత్రాన్ని నిర్మిస్తోంది. రి ఈ చిత్రానికి సంతోష్‌ నారాయణ్‌ సంగీతం అందిస్తున్నారు.