జనతా రికార్డుల రిపేరింగ్ ఇంకా చేస్తూనే ఉంది..!!

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 1న గ్రాండ్ గా విడుదలైన చిత్రం ‘జనతా గ్యారేజ్‌’..మలయాళ నటుడు మోహన్‌లాల్‌ చిత్రంలో కీలక పాత్రను పోషించగా దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూర్చారు. సమంత, నిత్యా మేనన్‌ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నిర్మించారు.. తెలుగు సినీ చలనచిత్ర చరిత్రలో మూడో అతిపెద్ద హిట్‌ చిత్రంగా నిలిచిన ఈ సినిమా కలెక్షన్ల విషయంలో ఈ సినిమా ఇప్పటికీ జోరు ప్రదర్శిస్తు మంచి వసూళ్ళని రాబట్టుకుంటుంది..

ఇప్పటివరకు అయితే జూనియర్ ఎన్.టి.ఆర్ కెరియర్ లో జనగా గ్యారేజ్ ఓ సూపర్ సక్సెస్ మూవీగా నిలిచింది. అయితే జనతా గ్యారేజ్ రికార్డుల దాహం ఇంకా తెరలేదనిపిస్తుంది.. కనపడ్డ రెకార్డునల్లా తుడిచేస్తుంది.. 2016లో ఎక్కువ మంది తిలకించిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది. టీవీలో అత్యధిక మంది చూసిన చిత్రంగా జనతా గ్యారేజ్ రికార్డ్ సృష్టించిందని టీవీ ఆడియన్స్ మోనటిరింగ్ ఏజన్సీ అయిన బీ ఏ ఆర్ సి ఇండియా ప్రకటించింది.ఈ చిత్రం తర్వాత మళ్లీ అదే రేంజ్ లో సినిమా చేయాలనే ఉద్దేశంతో ఎన్ టీఆర్ చాన్నాళ్లు ఖాళీగానే ఉన్న విషయం తెలిసిందే. చివరికి బాబీ చెప్పిన కథని ఓకేశాడు. సంక్రాంతి తర్వాత తారక్ – బాబీల చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.