ప్రభాస్ నెక్స్ట్ సినిమాకి ఫ్లాప్ దర్శకుడు..!!

బాహుబలి కోసం ప్రభాస్ ఏకంగా 4యేళ్లు కేటాయించిన విషయం తెలిసిందే. నిన్నటితో బాహుబలి 2 షూటింగ్ కి గుమ్మడి కాయకొట్టేశారు. దీంతో ప్రభాస్ ఇక తన తదుపరి చిత్రాలపై ద్రుష్టి పెట్టనున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే ‘రన్ రజా రాన్’ ఫేం సుజిత్ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ ని చేసేందుకు ప్రభాస్ రెడీ అయిన విషయం తెలిసిందే. దాదాపు రూ.150కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్ తో పాటుగా హిందీలోనూ రిలీజ్ చేయనున్నారు.సంగీత దర్శకులుగా బాలీవుడ్ సంగీత త్రయం శంకర్-ఎహసాన్-లాయ్ తీసుకోవాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

అంతేకాదు.. ప్రబాస్ కి జంటగా బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకోవాలనే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.ఇప్పుడు ప్రభాస్ మరో చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు ఫిల్మ్ నగర్ సమాచారమ్. గోపిచంద్ హీరోగా ‘జిల్’ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు రాథాకృష్ణ. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కిన ‘జిల్’ ప్లాప్ చిత్రంగా మిగిలింది. దీంతో.. రాథాకృష్ణ తొలి చిత్రంతోనే ప్లాప్ దర్శకుల లిస్టులో చేరిపోయారు. ఇప్పుడీ దర్శకుడితో ప్రభాస్ ఓ చిత్రం చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెలుస్తోంది. ఇదొక రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టెనర్ గా ఉండబోతుందంటున్నారు.