బాహుబలి లో మెరవనున్న జూనియర్..!!

జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ బాబీ డైరెక్షన్ లో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు.. బాబీ చెప్పిన కథ ఎన్టీఆర్ కి బాగా నచ్చేయడంతో వెంటనే ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లాడు.. త్వరలోనే షూటింగ్ మొదలవనుంది..ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిబుల్ రోల్ లో కనిపించనున్నాడట. ఈ మూడు పాత్రలో కూడా ఒకదానికొకటి పూర్తి విభిన్నంగా ఉండనున్నాయట. కాజల్, నివేద థామస్, అనుపమ లు హీరోయిన్స్ గా నటించనున్నారు..

ప్రస్తుతం జోరుగా ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ని కళ్యాణ్ రామ్ నిర్మించనున్నారు. అయితే ఎన్టీఆర్ ఈ సినిమాలో కాకుండా మరో సినిమాలో కూడా కనిపించనున్నట్లు సమాచారం అందుతుంది.. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న బాహుబలి లో ఎన్టీఆర్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడట.. ఆ పాత్ర చిత్రంలో వచ్చే కీలక సన్నివేశంలో రాగ ఆ సీన్ సినిమా మొత్తానికి హైలైట్ అవుతుందని అంటున్నారు.. మరి ఎన్టీఆర్ చేయబోయే ఆ పాత్ర ఏంటో తెలియాలంటే సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే..