బాక్సాఫీస్ తుప్పు వదలగొట్టిన బాస్..!!

మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెం.150’ థియేటర్స్ లో సందడి చేస్తోంది. 9యేళ్ల తర్వాత మెగాస్టార్ రీ-ఎంట్రీ ఇస్తుండటంలో.. మెగా అభిమానులు పండగ చేసుకొంటున్నారు.బాస్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు తెగ హడావిడి చేసేస్తున్నారు.తోలి రోజు సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకోవడంతో ఖైదీ సినిమా 2017 హిట్ల జాబితా లో మొదటి హిట్ కొట్టిన సినిమాగా నిలిచింది.. చిరు గ్లామర్, డాన్స్ ఏమాత్రం తగ్గలేదని, సినిమా చూసిన అభిమానులు అంటున్నారు.

ఖైదీ విడుదలైన మొదటిరోజే బాక్సాఫిస్ రికార్డుల తుప్పు వదలగొడుతుంది. సినిమా వచ్చిన మొదటి రోజే 25 నుంచి 30 కోట్ల వరకు కలెక్షన్స్ ని రాబట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనాలు చేస్తుంది.. ఓవర్ సీస్ లో సినిమా పది కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.. దీంతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడం ఖాయం అని, త్వరలోనే వంద కోట్ల క్లబ్ లో సినిమా చేరిపోవడం తథ్యం అని మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.. ఏదేమైనా చిరు అదిరిపోయే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారని చెప్పొచ్చు ..