ఖైదీ ఫంక్షన్ ..!!

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఖైదీనంబ‌ర్ 150 సంక్రాంతి కానుక‌గా జనవరి 11  న  రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈరోజు గుంటూరు లోని జిల్లాలోని హాయ్‌ లాండ్‌లో ఖైదీనంబ‌ర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ అభిమానులు, సినీప్ర‌ముఖుల మ‌ధ్య‌ గ్రాండ్‌గా జ‌ర‌గ‌నుంది.చిరు సరసన కాజల్ జతకట్టగా , రాయ్ లక్ష్మీ ఐటమ్ సాంగ్ లో మెరుస్తుంది. ఈ చిత్రానికి సంగీతం దేవీ శ్రీ ప్రసాద్, రాంచరణ్ నిర్మాత. అయితే ఈ రోజు జరగబోయే ప్రీ రిలీజ్ ఫంక్షన్ టెలికాస్ట్ ని మా మూవీస్ దక్కించుకుంది.

సాయంత్రం నుంచి ఎంతో హంగామా గా మొదలయ్యే ఈ ఫంక్షన్ కి వేలాది మంది అభిమానులు తరలి వస్తున్నారు.. అందుకు తగ్గట్టుగా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ఇక సినిమా విషయానికొస్తే వివి  నాయక్ మార్క్ యాక్షన్ ఏపీ సోడ్స్. రాయ్ లక్ష్మీ ఐటమ్ సాంగ్ లో హాట్ హాట్ అందాల ఆరబోత , కాజల్ అభినయం సూపర్ గా కుదిరాయట..పోసాని కృష్ణ‌ముర‌ళి పంచ్‌లు , బ్ర‌హ్మానందం కామెడీ అద్భుతంగా కుదిరాయట.. చిరు ఎంట్రీ సీన్‌, 3 పాట‌లూ, ఇంట్ర‌వెల్ బ్యాంగ్  ఈ సినిమాకి మెయిన్ హైలైట్ గా చెప్తున్నారు..