మెగా సందడి ఈరోజే..!!

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెం.150’.దాదాపు 9యేళ్ల తర్వాత రీ- ఎంట్రీ ఇస్తున్న మెగాస్టార్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సంక్రాంతి కానుకగా 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది.  దీంతో.. ప్రమోషన్స్ లో స్వీడుని పెంచేస్తోంది చిత్రబృందం. ఇప్పటికే మెగా ఖైదీలోని  పాటలన్నీ రిలీజ్ చేసింది.ఈ చిత్రంలో చిరు సరసన కాజల్ జతకట్టనుంది. రాయ్ లక్ష్మీ ఐటమ్ సాంగ్ లో మెరవనుంది. ఈ చిత్రానికి సంగీతం దేవీ శ్రీ ప్రసాద్. రాంచరణ్ నిర్మాత.

ఇక మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ నేడు గుంటూరు జిల్లాలోని హాయ్‌ లాండ్‌లో జరగనుంది.  ఈ వేడుకను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మెగా స్టార్ కుటుంబసభ్యులంతా తరలివస్తున్న ఈ స్టార్‌ షోనూ వీక్షించేందుకు అభిమానులు కూడా భారీగా తరలిరానున్నారు. అందుకు తగ్గట్టుగా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ఇక వేడుకలో దేవీశ్రీ ప్రసాద్ మ్యుజికల్‌ షోలో మెగా కుటుంబసభ్యులు కనువిందు చేయనున్నారు.