ఎన్టీఆర్ ని దాటని చిరు..!!

చిరు ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన 150 వ చిత్రం ఖైదీ నెంబర్ 150 సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.. సినిమా కూడా పాజిటివ్ టాక్ రావడంతో సినిమా సూపర్ హిట్ అవుతుందని అందరు అంటున్నారు.. కలెక్షన్స్ కూడా దుమ్ము రేపుతాయని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు..అయితే మెగాస్టార్ చిరంజీవి ఓ విషయంలో తారక్ ని దాటలేకపోయాడు.. ఎన్టీఆర్‌కు కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రం జనతాగ్యారేజ్ అన్న సంగతి తెలిసిందే..

ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందంటే ఇప్పటికి మిగిలిపోయి ఉన్న రికార్డులను తుడిచి పెడుతుంది.. అలాంటి ఈ సినిమా మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ విడుదల అయ్యింది.. అక్కడ స్పెషల్ ప్రీమియర్ షోలు ఒకరోజు ముందు వేయడం ఆనవాయితీ.. అలా 24 గ్యారేజ్ 24 ప్రీమియర్ షోలు వేస్తే.. ఖైదీ నంబర్ 150కి మాత్రం 18 స్పెషల్ షోలే వేస్తున్నారట. దాంతో ఈ విషయంలో ఎన్టీఆర్ చిరు పై పై చేయి సాధించినట్టు ఎన్టీఆర్ అభిమానులు చెప్పుకుంటున్నారు..