తెలంగాణాలో మెగా సినిమా రిలీజ్ ని ఆపేస్తున్నారా..!!

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెం.150’.దాదాపు 9యేళ్ల తర్వాత రీ- ఎంట్రీ ఇస్తున్న మెగాస్టార్ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సంక్రాంతి కానుకగా 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాజల్ కథానాయిక, రాయ్ లక్ష్మి స్పెషల్ సాంగ్ చేసింది.. సంగీతం దేవీ శ్రీ ప్రసాద్, రాంచరణ్ నిర్మాత.. ఇటీవలే  ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఫంక్షన్ వేడుక  ఎంతో ఘనం గా నిర్వహించిన సంగతి తెలిసిందే.. ట్రైలర్ కి కూడా విశేష స్పందన లభించింది.. అయితే తాజా సమాచారం ప్రకారం రేపే విడుదల అవ్వబోతున్న చిరు సినిమా తెలంగాణ లో రిలీజ్ అవకుండా అడ్డుకుంటున్నారని కొన్ని వర్గాలు అంటున్నాయి.. తెలంగాణ పోరాట సమయంలో చిరు స‌మైక్య‌వాదిగా ఉండడమే దీనికి కారణం అంటున్నారు..

సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం అవుతోన్న పోస్టుల ప్ర‌కారం చూస్తే వేయిమంది ఉద్య‌మ‌కారుల మ‌ర‌ణానికి కార‌ణ‌మైన తెలంగాణ ద్రోహి చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెంబ‌ర్ 150 ను తెలంగాణ‌లో రిలీజ్ కాకుండా చూడాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వాన్ని కోరుతున్న‌ట్టు ఈ ప్ర‌చారం జ‌రుగుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాకుండా అడ్డుపడి తెలంగాణ ప్రజలను మోసం చేయ‌డంతో పాటు ఉద్య‌మ‌కారుల మ‌ర‌ణానికి కార‌కుల్లో చిరు కూడా ఒక‌డైనందున అత‌డి సినిమాను చీము, ర‌క్తం ఉన్న ప్ర‌తి ఒక్క తెలంగాణ వ్య‌క్తి థియేట‌ర్ల‌లో చూడ‌వ‌ద్ద‌ని…ఈ సినిమాను థియేట‌ర్ల‌లో చూసిన వాళ్లు తెలంగాణ ద్రోహులు అని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్పుడిదే పెద్ద హాట్ టాపిక్ అయింది..మరి ఈ సినిమా రిలీజ్ అవుతుందో లేదో రేపు చూడాలి..