సీక్వెల్ దిశగా బాలయ్య సినిమా..!!

తెలుగుజాతి ఔనత్యాన్ని, గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప తెలుగు చక్రవర్తి ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. ఇప్పుడీ వీరుడి జీవిత గాధ నందమూరి బాలకృష్ణ వందో సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శాతకర్ణి ‘లో బాలయ్య సరసన శ్రియా జతకట్టనుంది. తల్లిగా అలనాటి హీరోయిన్ హేమ మాలిని నటించనున్నారు. ఈ సంక్రాంతి కానుకగా శాతకర్ణి ప్రేక్షకుల ముందుకు వస్తుంది..

ఈ చారిత్రాత్మక చిత్రాని దర్శకుడు క్రిష్ అద్భుతంగా తెరకెక్కించాడని చెబుతున్నారు. అయితే, ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఓ దిన పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషాలు తెలిపారు క్రిష్. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ కుమారుడు వాసిష్ఠీపుత్ర పులోమావి కథను సినిమాగా తీసే ఆలోచన కూడా ఉందట. అయితే, అదెప్పుడు.. ? ఎవరితో.. ?? అన్న విషయాలని మాత్రం క్రిష్ చెప్పలేదు. ఇదే జరిగితే ‘గౌతమిపుత్ర శాతకర్ణి’కి సీక్వెల్ కి కూడా వచ్చినట్టే. అని అభిమానులు అనుకుంటున్నారు..