మహేష్ సినిమాలో అలనాటి సూపర్ స్టార్..!!

మహేశ్ నటిస్తున్న తాజా సినిమా స్పైడర్. సెప్టెంబర్ 27న ఇది రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఇప్పటికే టీజర్ సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తోంది. మురగదాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.స్పైడర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ ‘భరత్ అను నేను’ అనే సినిమా చేయబోతున్నారు. గతంలోనే దీనికి సంబంధించిన ప్రకటన వెలువడింది. ఈ సినిమాలో మహేశ్ బాబు ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నారు. సామాజిక అంశాలతో కూడిన సినిమాలు తీయడంలో కొరటాల శివ దిట్ట.

వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు సినిమా బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. తాజాగా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో సూపర్ స్టార్ కృష్ణ నటించనున్నట్టు తెలుస్తోంది. మహేష్ బాబు బాలనటుడిగా ఉన్నప్పుడు పలు చిత్రాల్లో కృష్ణ, మహేష్ లు కలసి నటించిన సంగతి తెలిసిందే. ఆపై మహేష్ హీరోగా మారిన తరువాత రాజకుమారుడు, వంశీ, టక్కరి దొంగ చిత్రాల్లో ఆయన కనిపించారు. ఆపై మహేష్ నటించిన ఏ చిత్రంలోనూ ఆయన స్వయంగా నటించలేదు. ఇక 18 సంవత్సరాల తరువాత ఈ తండ్రీ కొడుకులు కలసి నటిస్తున్నారన్న వార్త వెలువడటంతో అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కృష్ణతో పాటు ఈ చిత్రంలో ఎమ్మెల్యేలు, మంత్రుల పాత్రల్లో పలువురు సీనియర్ నటులు నటిస్తున్నట్టు తెలుస్తోంది.

LEAVE A REPLY