ఆహీరోలే నా టార్గెట్..!!

అందాల రాక్షసి లావణ్య త్రిపాఠికి అన్నీ ఉన్న స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు మాత్రం రావడం లేదు. అందుకోసం గ్లామర్ డోస్ పెంచేందుకు కూడా ఆమె రెడీ అయ్యింది. ఆ దిశగా దర్శక-నిర్మాతలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. వరుణ్ తేజ్ ‘మిస్టర్ ‘లో హాట్ హాట్ గా కనువిందు చేసింది కూడా. అయినా స్టార్ హీరోల సరసన ఛాన్సులు సంపాదించుకోలేకపోతోంది.ఇప్పుడు ఆమె ఆశలన్నీ మెగా హీరో సినిమాపై పెట్టుకొంది.

వి.వి. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సాయిధరమ్ తేజు సినిమాలో లావణ్య హీరోయిన్ గా ఎంపికైన విషయం తెలిసిందే. ఈ సినిమాతో మెగా హీరోలు రామ్ చరన్, అల్లు అర్జున్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా అవకాశాలు వస్తాయని ఆశిస్తోంది. మరి.. అందాల రాక్షసి ఆశలు మేరకు నెరవేరుతాయనేది చూడాలి. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రామ్ ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ సినిమాలోనూ లావణ్య హీరోయిన్ గా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం నుంచి మేఘా ఆకాష్ తప్పుకోవడంతో.. ఆ అవకాశం లావణ్యకి దక్కింది.

LEAVE A REPLY