మహేష్ స్పైడర్ సీన్స్ లీక్

mahesh babu spyder movie making video leaked
mahesh babu spyder movie making video leaked

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తో చేస్తోన్న ‘స్పైడర్’ సినిమాను ఫినిష్ చేసే పనిలో పడ్డ విషయం తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడో మొదలైనా.. భారీ బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్న విధానానికి లేట్ అవ్వాల్సిందేనని ఇప్పటికి అర్థమవుతుంది. అందుకే ఫ్యాన్స్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకుని ఓపికగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే రిలీజైన చిన్న టీజర్ తో ఫుల్ ఖుషీ అయిపోయిన ఫ్యాన్స్.. మధ్యలో షూటింగ్ స్పాట్ నుంచి వచ్చిన కొన్ని ఫోటోలతో సంతృప్తి వ్యక్తం చేశారు.

ముఖ్యంగా ఆ ఫోటోల్లో మహేష్ లుక్ సూపర్ గా ఉండటం.. స్పైడర్ యాక్షన్ సీక్వెన్స్ లు దుమ్మురేపుతున్నాయని క్లారిటీ వస్తుండటంతో సినిమాపై చాలానే అంచనాలు పెట్టేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఉన్నట్టుండి ఈ మహేష్ ‘స్పైడర్’ షూటింగ్ కు సంబంధించి కొన్ని నిమిషాల నిడివి ఉన్న వీడియో ఒకటి లీక్ అవడం హాట్ టాపిక్ గా మారింది. అందులోనూ ఆ లీకైన వీడియోలో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లు, కార్ ఛేజింగ్ లు, వందల మంది మధ్య మహేష్ పోరాటాలు క్లియర్ గా కనిపిస్తుండటం గమనార్హం. దీంతో చిత్ర యూనిట్ ఇప్పుడు కొంచెం షాక్ కి గురై.. ఈ విధమైన లీక్ లకు చెక్ పెట్టే పనిలో పడినట్లు తెలుస్తోంది.

ఏదిఏమైనా, తాజా లీకేజ్ తో మహేష్ ‘స్పైడర్’ ను మురుగదాస్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడని అర్థమైపోతుంది. ఇదిలా ఉంటే, రీసెంట్ గా రిలీజైన స్పైడర్ స్మాల్ టీజర్ లో కేవలం రోబోటిక్ స్పైడర్ ను మాత్రమే చూపించిన విషయం తెలిసిందే. అందుకే ఇప్పుడు కొత్తగా ఫ్యాన్స్ కోసం ఒక నిమిషం పాటు నిడివి ఉండే యాక్షన్ ప్యాకెడ్ టీజర్ ను మురుగదాస్ రెడీ చేయిస్తున్నాడట. ఇక ఈ కొత్త టీజర్ మహేష్ బర్త్ డే సందర్బంగా ఆగష్టు 9న రిలీజ్ అవుతుందని సమాచారం. ఇకపోతే, స్పైడర్ లో మహేష్ కు జోడీగా స్టార్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోన్న విషయం తెలిసిందే.