రివ్యూ – ఖైదీ నెంబర్ 150


  [CLICK HERE FOR ENGLISH REVIEW]  

నటీనటులు : చిరంజీవి, కాజల్, తరుణ్ అరోరా, బ్రహ్మానందం
మాటలు: పరుచూరి బ్రదర్స్‌, బుర్రా సాయి మాధవ్‌, వేమారెడ్డి
సినిమాటోగ్రఫీ : రత్నవేలు
మ్యూజిక్ : దేవి శ్రీ ప్రసాద్
దర్శకత్వం : వి.వి. వినాయక్
ప్రొడ్యూసర్ : రామ్ చరణ్
విడుదల తేదీ : 11 జనవరి 2017

దాదాపు తొమ్మిది సంవత్సరాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం ఖైదీ నెంబర్ 150.మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా చిరు 150 వ సినిమా అవడంతో అందరికి ఈ సినిమా పై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి.. ఇప్పటికే సాంగ్స్ తో, ట్రైలర్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిరు ఈ రోజు బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ప్రేక్షకులముందుకు వస్తున్నాడు.. తమిళ చిత్రం ‘కత్తి’కి రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వస్తుంది.. మరి మెగా స్టార్ అభిమానుల అంచనాలను ఏ మేరకు అందుకున్నాడా తెలుసుకోవాలంటే ఈ సమీక్ష లో కి వెళ్లాల్సిందే..

కథ విషయానికొస్తే..

కోల్ కతా సెంట్రల్ జైల్లో నుంచి ఎంతో తెలివిగా తప్పించుకున్న కత్తి శీను హైదరాబాద్ కు వచ్చి బ్యాంకాక్ కు వెళ్లాలని ప్రయత్నిస్తుండగా లక్ష్మి (కాజల్)ని చూసి ప్రేమలో పడతాడు. దాంతో బ్యాంకాక్ వెళ్లాలనే ఆలోచనను విరమించుకుని లక్ష్మి ని ప్రేమిస్తుంటాడు.. ఆ సమయంలోనే అచ్చం తనలా ఉన్న శంకర్ పై హత్య ప్రయత్నం జరుగుతుండడం చూసి తనలా ఉన్నఆ శంకర్ (చిరంజీవి ద్విపాత్రాభినయం)ను కాపాడి ఆసుపత్రిలో చేరుస్తాడు. తన లాగే ఉన్న శంకర్ ని పోలీసుల కి పట్టించి తాను శంకర్ స్థానంలో వెళ్లి డబ్బు సంపాదించాలని అనుకుంటాడు. కానీ శంకర్ స్థానంలో వెళ్లిన శ్రీను కి అతన్ని నమ్ముకుని కొన్ని వేల రైతు కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని తెలుసుకుంటాడు.. రైతుల క్షేమం కోసం శంకర్ ఎంతగా తపిస్తాడన్నది తెలుసుకుని శంకర్ స్థానంలో తాను రైతుల పక్షాన నిలిచి.. శంకర్ ఆశయాల్ని ఎలా అమలు చేసాడు అనేదే మిగితా కథ.

నటీనటులు

దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన చిరంజీవి సినిమాలో చాల యంగ్ గా కలిపించారు.. ఎప్పటిలానే తన నటనతో రెండు విభిన్నమైన పాత్రల్ని పండించారు. డాన్సుల్లో చిరు కి ఇంకా వన్నె తగ్గలేదు.. ఎమోషనల్ డైలాగ్స్, పవర్ ఫుల్ డైలాగ్స్ విషయంలో చిరు ప్రత్యేకతే వేరు అని మరో సారి నిరూపించాడు.చిరు సరసన కాజల్‌ చాల అందంగా కనిపించింది. గ్లామర్ పాత్రలో ప్రేక్షకులను కనువిందు చేసింది.. విలన్ పర్వాలేదనిపించారు.. బ్రహ్మానందం, పోసాని, జయప్రకాశ్‌రెడ్డి వాళ్ల పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.వారు చేసిన కామెడీ అంతంత మాత్రంగానే ఉంది..

Prev1 of 2