నాగార్జున అందుకు ఒప్పుకున్నట్లేనా..!!

కింగ్ నాగార్జున త్వరలో తన హిట్ సినిమా సీక్వెల్ చేయడానికి ఒప్పుకున్నారు.. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా రూపొందిన శివ అప్పట్లో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ రాబోతుంది అంటున్నారు.. వంగవీటి టైటిల్‌ తో వర్మ సినిమా ఇటీవల ఆడియో వేడుకను విజయవాడలోని కోనేరు లక్ష్మయ్య కాలేజ్‌ గ్రౌండ్స్‌ లో నిర్వహించారు. ఇక హైదరాబాద్‌ లో మంగళవారం శివ టు వంగవీటి అనే కార్యక్రమాన్ని ప్లాన్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రాజమౌళి, పూరి జగన్నాథ్‌, నిర్మాత పీవీపీ, నాగార్జున, వెంకటేష్‌, బోయపాటి శ్రీను, రాజశేఖర్‌ ఇలా ఇండస్ట్రీ కి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా..నాగార్జున మాట్లాడుతూ తనను శివ సినిమా సీక్వెల్ తీయమని ఎందరో అడిగారని, అయితే ఇప్పటివరకు ఎవరికీ ఏమి చెప్పలేదని, రాంగోపాల్ వర్మ ఆ బాధ్యతను తీసుకుంటే శివ2 చేయడానికి సిద్దంగా ఉన్నానని నాగార్జున ప్రకటించారు.ఇప్పటి నుండి రాము చేసే ప్రతి సినిమా డిఫరెంట్‌గా ఉండాలని కోరుకుంటున్నాను. వంగవీటి సినిమా చూస్తుంటే చాలా ఇన్‌టెన్స్‌గా అనిపిస్తున్నాయి. సినిమా తప్పకుండా పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.ఈనెల 23న వంగవీటి సినిమా విడుదల అవుతున్న సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.