బాలకృష్ణ తో నారా రోహిత్..!!

రీసెంట్ గా వచ్చిన అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో మంచి హిట్ కొట్టిన నారా రోహిత్ తన మనసులో మాట బయట పెట్టాడు.. బాలయ్య 100 వ సినిమా లో నటించాలని నారా రోహిత్ అనుకున్నప్పటికీ ఎందుకో అందులో చేయడానికి  కుదరలేదు. అయితే ఎప్పటికైనా బాలయ్య తో కలిసి నటిస్తా అని నారా రోహిత్ గౌతమి పుత్ర శాతకర్ణి ఆడియో లో చెప్పాడు.. ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు సాధిస్తుందని ముందే హింట్ కూడా ఇచ్చేసాడు.

తాను గౌతమీ పుత్ర శాతకర్ణి లో కొన్ని సీన్లు చూసాను అని, ఆ సీన్లు చూసాక తన నోటి వెంట మాట రాలేదు అని, ఆ సీన్లు చూడటం నా అదృష్టం గా భావిస్తున్నాను అని చెప్పి ఫుల్ సినిమా ని బిగ్ స్క్రీన్ పై చూడటానికి ఎంత గానో ఎదురు చూస్తున్నా అన్నారు..ఈ సినిమా బంపర్ హిట్ అవ్వటం ఖాయం అని అభిమానులకు ముందే హింట్ ఇచ్చి అందరిలో ఉత్సాహం రేపాడు.. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో బాలకృష్ణ సరసన శ్రియా జతకట్టనుంది. తల్లిగా అలనాటి హీరోయిన్ హేమ మాలిని కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి సంగీతం చిరంతన్ భట్.