రాజకీయాల్లో కి దిగనున్న మరో స్టార్ హీరో..!!

బాహుబలి సినిమాలో ప్రతినాయకుడి పాత్ర పోషించి అందర్నీ ఆకట్టుకున్న రానా ఆ సినిమా తర్వాత  హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. అందులో ప్రస్తుతం తేజ దర్శకత్వంలో నేనే రాజు నేనే మంత్రి.. కాజల్ కథానాయిక.. సరైనోడు అందాల ఎమ్మెల్యే గా నటించిన  కేధరిన్ లీడ్ రోల్ చేస్తోంది. పొలిటికల్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రంలో రానా యంగ్ పాలిటీషియన్‌గా కనిపిస్తాడట. ఈ సినిమా ప్రస్తుతం అనంతపూర్‌లో షూటింగ్ జరుపుకుంటోంది.

అంతేకాదు రానా చేసే పొలిటికల్ రోల్ అనంత‌పురం జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి రోల్‌కు కాస్త ద‌గ్గ‌ర‌గా ఉంటుంద‌ని తెలుస్తోంది. ఆ జిల్లాలో ఆ మంత్రికి , మంత్రి ఫామిలీ కి ఉన్న క్రేజ్ పరంగానే ఆవిధంగా తేజ ప్లాన్ చేసాడని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించి ఓ స్టిల్ కూడా రిలీజ్ చేశారు. రానా ఓ నాయకుడిగా అందరికీ అభివాదం చేస్తూ నడుస్తూ వ‌స్తున్నాడు. సోలో గా బాక్సాఫీసు వద్ద హిట్ కొట్టాలని రానా చేసే ఈ ప్రయత్నం ఎంత వరకు సఫలమవుతుందో చూడాలి..