రివ్యూ – నేనే రాజు నేనే మంత్రి

Nene Raju Nene Manthri Movie Review

నటీనటులు : రానా, కాజల్, క్యాథెరిన్, తనికెళ్ల భరణి, నవదీప్, శివాజీ రాజా తదితరులు
సినిమాటోగ్రఫి : వెంకట్.సి. దిలీప్
సంగీతం : అనూప్ రూబెన్స్
ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు
దర్శకుడు : తేజ
నిర్మాతలు : కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి, సురేష్ బాబు
విడుదల తేది : ఆగష్టు 11, 2017.

బాహుబలి, ఘాజీ చిత్రాల హిట్లతో ఫుల్ ఖుషీలో ఉన్న రానా… ఈసారి జోగేంద్రగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రానా హీరోగా దర్శకుడు తేజ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’. కాజల్, క్యాథెరిన్ హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా కమర్షియల్ పొలిటికల్ డ్రామా ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కగా ఈరోజే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఈమేరకు మెప్పించిందో చూద్దామా..

కథ,

జోగేంద్ర కి ఉరిశిక్ష విధించడానికి అనంతపురం సెంట్రల్ జైలు కి తీసుకురావడంతో కథ మొదలు అవుతుంది. తన జీవితాన్ని ప్రజలందరికీ తెలిసేలా తాను చెప్పే విషయాన్ని టీవీల్లో లైవ్ ఇవ్వాలని అతని చివరి కోరికను కోర్టు మన్నిస్తుంది. దీంతో కథ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళుతుంది. జోగేంద్రకి కుటుంబం అంటే అమిత ప్రేమ ముఖ్యంగా రాధ అంటే ప్రాణం. ఇంటి విషయంలో హీరోగా వుండే జోగేంద్ర మిగిలిన సమాజం పట్ల మాత్రం పూర్తి స్వార్ధంతో ప్రవర్తిస్తాడు. ఓసారి ఒక సర్పంచ్ భార్య చేతిలో అతని కుటుంబానికి అవమానం జరుగుతుంది. దీన్ని సీరియస్ గా తీసుకున్న జోగేంద్ర సవాల్ చేసి మరీ సర్పంచ్ అవుతాడు. అక్కడితో ఆగకుండా రాజకీయంగా ఎదగడానికి ఎన్ని కుయుక్తులు పన్నాలో అన్నీ పన్నేస్తాడు. మంత్రి స్థాయికి వచ్చేస్తాడు. తనకు ఎదురైన కొన్ని సంఘటనలతో తానే సీఎం అవ్వాలని ప్రయత్నిస్తాడు. అయితే పార్టీలోని పరిస్థితులు అందుకు సహకరించక పోవడంతో తన పదవికి రాజీనామా చేసి ఇండిపెండెంట్ క్యాండిడేట్‌గా చేస్తాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటి? అనేది తర్వాతి స్టోరీ…

నటీనటులు,

నేనే రాజు నేనే మంత్రి మూవీలో రానా పెర్ఫార్మెన్స్ సినిమాకు మెయిన్ హైలెట్. వాణిజ్య పరమైన అంశాలు పక్కనబెడితే రానా కెరీర్ లో ఎన్నటికీ నిలిచిపోయే పాత్ర జోగేంద్ర.ఈ సినిమాలో జోగేంద్ర క్యారెక్టర్ ఒకే సమయంలో ఇటు చెడుని అటు ప్రేమని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇలాంటి పాత్ర సృష్టించి దర్శకుడు తేజ నటుడు రానా కి సవాల్ విసిరితే దాన్ని అవలీలగా చేసాడు రానా . కాజల్ అందంతో మెప్పించింది. రానా, కాజల్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. రానా, కాజోల్ మధ్య ప్రేమ బంధం, నవదీప్ తో సీన్స్, హాస్పిటల్ సీన్, ప్రదీప్ రావత్ సీన్ రానాలోని నటుడిని హైలైట్ చేస్తే మొత్తం సినిమాని అతను ఒంటి చేత్తో నడిపించాడు. కేథరిన్, నవదీప్, అశుతోష్ రానా, శివాజీ రాజా, తనికెళ్ల భరణి, అజయ్, ప్రదీప్ రావత్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం,

దర్శకుడు తేజ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒక్కసారి ఓ పద్ధతికి అలవాటు పడ్డాక దాని నుంచి బయటకు రావాలంటే చాలా కష్టం . ఆలోచనల విషయంలో ఇది ఎక్కువగా వర్తిస్తుంది. కానీ నేనే రాజు నేనే మంత్రి కథతో తేజ లో వచ్చిన మార్పుని మనం స్పష్టంగా చూడొచ్చు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఇలాంటి ఫామిలీ, క్యారెక్టర్ ఓరియెంటెడ్ సినిమా చేయాలి అనుకోవడమే కాదు అందుకోసం రాసుకున్న సీన్స్ బాగున్నాయి. ముఖ్యంగా రానా క్యారెక్టర్ ని ఎలివేట్ చేసే సీన్స్ హైలైట్. ఇక రాజకీయాల గురించి డైలాగ్స్. నవదీప్, కాజల్, కథెరిన్ పాత్రల రూపకల్పన తో తేజ ఓ మెట్టు పైన కనిపించాడు.అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఇక సురేష్ ప్రొడక్షన్స్, బ్లూ ప్లానెట్ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణ విలువలు అద్భుతం. సినిమా పిక్చరైజేషన్, యాక్షన్ సీన్లు, పంచ్ డైలాగులు ఇలా అన్ని టెక్నికల్ విభాగాలు ప్రేక్షకులను మెప్పించాయి.

గోల్డ్(+),

రానా
డైరెక్షన్
ఎమోషనల్,యాక్షన్ సీన్స్
కాజల్

గోల్డ్(-),

సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ డ్రాగ్
పూర్ క్లైమాక్స్ ..

ట్యాగ్ లైన్ : రాజు కాదు మంత్రి కాదు..

గోల్డ్ స్క్రీన్ రేటింగ్ : 2.75 /5

LEAVE A REPLY