ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారా..?

ntr fans unhappy bigg boss teaser
ntr fans unhappy bigg boss teaser

టాలీవుడ్ సర్కిల్ లో ఇప్పుడు ఓ న్యూస్ హాట్ హాట్ డిస్కషన్ కు దారి తీసింది. అది కూడా వరుస సక్సెస్ లతో ఫుల్ జోష్ లో ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు సంబంధించిన విషయం కావడం విశేషం. ఆ స్టోరీలోకి వెళితే, చిన్న వయస్సులోనే తెలుగు సినీ ప్రపంచంలో తిరుగులేని స్టార్ డమ్ తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్.. మధ్యలో కాస్త తడబడినా.. ఇప్పుడు మళ్ళీ పుంజుకుని స్టార్ హీరోగా అవార్డులు, రివార్డులు అందుకుంటూ సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. అటువంటి ఎన్టీఆర్ ఇప్పుడు బుల్లితెరపై కూడా దుమ్మురేపడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా బుల్లితెరపై గ్రాండ్ గా అడుగుపెడుతున్న ఎన్టీఆర్.. దానికి సంబంధించిన షూటింగ్ ను ముంబైలో చేస్తుండటం గమనార్హం.

ఇదిలా ఉంటే, తెలుగు బుల్లితెరకు సంబంధించి ఎన్టీఆర్ బిగ్ బాస్ రియాల్టీ షో టీజర్ ను తాజాగా రిలీజ్ చేసిన విషయం తెలిసే ఉంటుంది. ఇక ఈ టీజర్ అందరినీ బాగా ఆకట్టుకోవడంలో సక్సెస్ అయిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ కు థమన్ అందించిన జేమ్స్ బాండ్ తరహా బీజీఎమ్ తోడవడంతో టీజర్ షో మొదలవ్వకుండానే ఫుల్ కిక్ ఇస్తోంది. అందుకే ఈ టీజర్ రిలీజైన వెంటనే ఫ్యాన్స్ చేసిన హంగామా మామూలుగా లేదు. అయితే, ఇప్పుడు సడెన్ గా కొంతమంది ఎన్టీఆర్ హార్డ్ కోర్ ఫ్యాన్సే తాజా టీజర్ తో చాలా ఫీలవుతున్నారని వార్తలు వినిపిస్తుండటం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఈ నేపథ్యంలో ఓవైపు టీజర్ స్టైలిష్ గా ఉండి ఎన్టీఆర్ తన లుక్స్ తో మెస్మరైజ్ చేస్తే.. దానికి ఫ్యాన్స్ అంతలా ఫీలవ్వడం దేనికనే డౌట్ రావొచ్చు. అందుకే ఇప్పుడు దానికి కారణం చెబుతూ.. టీజర్ లో ఎన్టీఆర్ ను చూపించిన విధానమే అభిమానుల ఆగ్రహానికి కారణం అంటూ మీడియాలో కథనాలు వస్తుండటం గమనార్హం.

ప్రధానంగా బిగ్ బాస్ షో టీజర్ లో ఎన్టీఆర్ జేమ్స్ బాండ్ తరహాలో బాగానే కనిపించినా.. అమ్మాయిలు ఎన్టీఆర్ మీద ఓవర్ గా పడిపోతూ ఉండటమే బాగోలేదని అంటున్నారు. ఎందుకంటే, రియల్ లైఫ్ లో ఎన్టీఆర్ ది ఇలాంటి ప్లే బాయ్ టైప్ క్యారెక్టర్ కాదు కాబట్టి అని అంటున్నారు. అంతేకాకుండా అప్పుడప్పుడూ పార్టీల్లో మాత్రమే సరదాగా పాల్గొనే ఎన్టీఆర్ కు రియల్ లైఫ్ లో చాలా మంచి క్లీన్ ఇమేజ్ ఉందని, అలాంటి రియల్ హీరోని అమ్మాయిలతో కలిసి ప్లే బాయ్ తరహాలో చూపించడం కరెక్ట్ కాదని వాదిస్తున్నారట. మొత్తంగా తమ హీరో ఇమేజ్ ను ఇలా డ్యామేజ్ చేస్తున్నారని ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ బిగ్ బాస్ షో నిర్వాహకులపై మండిపడుతున్నారట. ఇక ఈ విషయంలో ఫ్యాన్స్ ప్రకారం.. ఎన్టీఆర్ కు రాముడు మంచి బాలుడు అనే ఇమేజ్ ఉండటం కరెక్టే అయినా.. ఇదంతా ఎంటర్టైన్మెంట్ రంగంలోని ఓ ప్రోగ్రామ్ లో భాగమని చూస్తే బాగుంటుందేమో.