ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా ఫిక్స్ అయ్యింది..!!

chandu-mondeti
జనతా గ్యారేజ్ మూవీ తరువాత జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ ఎవరితో చేయాలా అని డైలమాలో పడ్డాడు. పూరీ జగన్నాథ్ ఇజం తరువాత జూనియర్ తో చేయడానికి రెడీగా వున్నా ఇజం ఫ్లాప్ కావడంతో ఎన్టీఆర్ వెనక్కి తగ్గాడట.. కానీ గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ కి మాత్రం త్రివిక్రమ్ తో మూవీ చెయ్యాలనుందట. కానీ త్రివిక్రమ్ కి వేరే కమిట్ మెంట్స్ వుండడం తో జూనియర్ వేరే ఛాయిస్ కోసం చూస్తున్నాడు.

ఈ నేపథ్యంలో చందు మొండేటి ఎన్టీఆర్ తో ఓ సినిమా చేస్తున్నాడని ఎక్కువగా వినిపిస్తోంది. తాజాగా ఆయన చేసిన ‘ప్రేమమ్’ హిట్ కావడంతో, అగ్రకథానాయకుల దృష్టి ఆయనపై పడింది.అలా ఎన్టీఆర్ కూడా ఆయనతో ఒక సినిమా చేయడానికి ఆసక్తిని చూపుతున్నాడని అంటున్నారు. ఎన్టీఆర్ కి చందు కథ చెప్పేయడం .. ఆయనకి నచ్చేయడం జరిగిపోయాయని మరికొందరు అంటున్నారు. ఈ సినిమాకి నిర్మాతగా ఐ డ్రీమ్ వాసు వ్యవహరించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. చైతూ కోసం కూడా ఒక కథను సిద్ధం చేసి పెట్టిన చందూ, ముందుగా ఎన్టీఆర్ తోనే సెట్స్ పైకి వెళ్లొచ్చని సమాచారం.