రానా సినిమాలో ఎన్టీఆర్..!!

రానా ప్రధాన పాత్ర ధారిగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ‘ఘాజీ’ సినిమా తెరకెక్కింది. పీవీపీ బ్యానర్ – మ్యాటినీ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకి సంబంధించిన రానా లుక్ ఈమధ్యే విడుదల చేయగా నేవీ ఆఫీసర్ గా రానా లుక్  ఆకట్టుకుంటోంది.1971 లో జరిగిన ఇండియా – పాకిస్థాన్ యుద్ధం .. ఘాజీ అనే సబ్ మెరైన్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. సబ్ మెరైన్ నేపథ్యంలో రూపొందిన మొదటి తెలుగు సినిమా ఇదే.

ఈ సినిమాలో తాప్సి .. ఓంపురి ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఫిబ్రవరి 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో ట్రైలర్ ను విడుదల చేసే ఆలోచలో వున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. రెండు భాషల్లోను ఈ సినిమా ట్రైలర్ ను ఒకేసారి వదలనున్నారు. హిందీ వెర్షన్ ట్రైలర్ కి అమితాబ్ తో వాయిస్ ఓవర్ చెప్పించాలనుకుంటున్నారట. అదే విధంగా తెలుగు వెర్షన్ ట్రైలర్ కి ఎన్టీఆర్ తో వాయిస్ ఓవర్ చెప్పించనున్నారట. మరి ఈ ట్రైలర్ ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.