అంతా తూచ్.. మెగా ఫంక్షన్ కి పవన్ వస్తున్నాడు..!!

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెం.150’. సంక్రాంతి కానుకగా ఈ నెల11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈలోపు ఈ నెల 11న విజయవాడ – గుంటూరు మధ్యలో ‘హాయ్ ల్యాండ్’ ఎమ్యూజ్ మెంట్ పార్క్ లో మెగా ఖైదీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ అదిరిపోయే రేంజ్ లో ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే, మెగాస్టార్ రీ-ఎంట్రీ ఇస్తోన్న తర్వాత చేస్తోన్న బిగ్ ఈ ఫంక్షన్ కి దర్శక రత్న దాసరి నారాయణ రావుని మెయిన్ అథితిగానూ, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుని ముఖ్య అథితిగా వస్తున్నట్లు నిన్ననే తెలిపారు.. అయితే పవన్ రావట్లేదని అల్లు అరవింద్ క్లారిటీ ఇవ్వగా పవన్ అభిమానులు నిరాశపడ్డారు..

అయితే అల్లు అరవింద్ ప్రకటన నిజమే అయినా పవన్ ఈ ఫంక్షన్ కి రావడం ఖాయం అంటున్నారు.. ఇంతకీ విషయం ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ అంటే పవన్ కి చాల అభిమానం. పలుమార్లు వేదికలపై వదిన సరేఖ నాకు తల్లిలాంటిదని చెప్పుకొన్నారు. అలాంటి వదిన స్వయంగా వచ్చి మెగా ఫంక్షన్ ని ఆహ్వానిస్తే.. పవన్ రాకుండా ఎలా ఉంటారు ? ఇప్పుడు అదే జరిగింది. చిరంజీవి – సురేఖ దంపతులు స్వయంగా వెళ్లి మెగా ఫంక్షన్ కి పవన్ ని ఆహ్వానించారాట. దీంతో.. తప్పకుండా వస్తానని వదినకి మాటిచ్చాడట పవన్. ఇక, పవన్ రాక పక్కా అంటున్నారు మెగా ఫ్యాన్స్.