పవన్ సినిమా డౌటేనట..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కాటమరాయుడు చిత్రంలో నటిస్తున్నాడు.. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పవన్ సరసన శృతిహాసన్ జతకట్టనుంది. ఈ చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్.డాలీ దర్శకుడు. ఇందులో పవన్ ఫ్యాక్షనిస్టు లీడర్ గా కనిపించబోతున్నారు. శరత్ మరార్ నిర్మాత. మార్చిలో కాటమరాయుడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం తర్వాత పవన్ పూర్తిగా త్రివిక్రమ్ సినిమాపై ద్రుష్టి పెట్టనున్నాడు.. ఆ తర్వాత పవన్ చేయబోయే నేసన్ సినిమా డౌట్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.

పవన్ తో ఓ తమిళ్ రీమేక్ చేయాలనీ ఏ ఎమ్ రత్నం ఎప్పట్నుంచో ప్రయత్నిస్తుండగా, ఈ మధ్యే నేసన్ దర్శకుడిగా ఓ సినిమా ప్రారంభమయ్యింది.. అయితే ఆ సినిమా పట్టాలెక్కడం డౌటే అని విశ్వసనీయ వర్గాల సమాచారం.  మొదట్లో త్రివిక్రమ్, నేసన్ ల ప్రాజెక్ట్స్ ని ఒకేసారి చేద్దామని ట్రై చేసిన ఇప్పుడు అది వీలవట్లేదట.. పూర్తిగా త్రివిక్ర‌మ్ సినిమాపైనే దృష్టి పెట్టాల‌ని భావిస్తున్నాడ‌ట‌. అందుకే నేస‌న్ సినిమాని హోల్డ్‌లో పెట్టాడ‌ట‌. నేస‌న్ సినిమా చేస్తాడా, లేదా అన్న‌ది అనుమానంగా మారింద‌ని, ఆ స్థానంలో ర‌త్నంతో మ‌రో సినిమా చేయ‌డానికి ప‌వ‌న్ స‌ముఖంగా ఉన్నాడ‌ని టాక్‌. వ‌రుస‌గా రీమేక్‌లు చేయ‌డం అంత మంచిది కాద‌ని, అది త‌న కెరీర్‌పైనా ప్ర‌భావం చూపిస్తుంద‌ని ప‌వ‌న్ భ‌య‌ప‌డుతున్నాడ‌ని, అందుకే నేస‌న్ సినిమా ప‌క్క‌న పెట్టే ఛాన్సుంద‌ని ప‌వ‌న్ కాంపౌండ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.