పిట్టగోడపై మనసుపడ్డ మాటీవీ..!!

Celebrate This Sankranthi with Television Premiere of recent released film #PittaGoda .. Sunday at 6 PM on Maa TV

Posted by Maa TV on Monday, January 9, 2017

విశ్వదేవ్, పునర్నవి భూపాలం జంటగా నూతన దర్శకుడు కేవీ ఆనంద్ తెరకెక్కించిన చిత్రం పిట్టగోడ.. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు సమర్పిస్తున్న ఈ సినిమా ఇటీవలే విడుదలై మంచి పేరు ని సంపాదించుకోగా, ట్రైలర్స్, సాంగ్స్ తో యూత్ లో మంచి క్రేజ్ ని ఏర్పరుచుకుంది.. ఎంతో క్యూట్ గా ప్రెసెంటేషన్ ఉందని పలువురి ప్రశంశలు కూడా అందుకున్న ఈ సినిమా పై మాటీవీ మనసుపడ్డట్లు తెలుస్తుంది..

ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఆదివారం సాయంత్రం ప్రసారం చేయనున్నట్లు తెలిపింది.. దీనికి సంబంధించిన ప్రోమోలు ఇప్పటికే నెట్ లో హల్చల్ చేస్తుండగా, ఇప్పటికే వెండి తెరమీద మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ సినిమా బుల్లితెరపై కూడా మంచి పేరు తెచ్చుకుంటుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ చిత్రాన్ని మిస్ అయినవారు వెంటనే చూసేయండి..