శాతకర్ణి పై రాజమౌళి చెయ్యి ఉందట.!!

నందమూరి బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. ఈ సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చారిత్రాత్మాక చిత్రాన్ని దర్శకుడు క్రిష్ అద్భుతంగా తీర్చిదిద్దాడనే టాక్ వినిపిస్తోంది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు, సినీ ప్రముఖులు క్రిష్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ని క్రిష్ అద్భుతంగా తెరకెక్కించడం వెనక దర్శకుధీరుడు రాజమౌళి హస్తం కూడా ఉందట. కథ-కథనంలో స్పష్టంగా క్రిష్ మార్క్ తోనే తెరకెక్కాయి.

అయితే, గ్రాఫిక్స్, వి ఎఫ్ ఎక్స్ విషయంలో మాత్రం క్రిష్ కి రాజమౌళి కొన్ని సూచనలు చేశాడట. ఆ సూచనలు బాగా హెల్ప్ అయ్యాయని క్రిష్ చెప్పడం విశేషం. సాధ్యమైనంత వరకూ సహజత్వానికి దగ్గరగా సినిమా తీయమన్నాడని చెప్పాడు. అప్పుడే పోస్ట్ ప్రొడక్షన్ తక్కువ సమయంలో పూర్తవుతుందని అన్నాడనీ .. తాను అలాగే చేశానని అన్నాడు.ఈ చిత్రంలో బాలయ్య సరసన శ్రియా జతకట్టనుంది. తల్లిగా అలనాటి హీరోయిన్ హేమ మాలిని జతకట్టనుంది. ఈ చిత్రానికి సంగీతం చిరంతన్ భట్.