సినిమా కోసం ప్రభాస్ భారీ రిస్క్..!!

బాహుబలి సినిమాని కంప్లీట్ చేసుకుని తన తరువాత సినిమాలకి రెడీ అవుతున్నాడు ప్రభాస్.. బాహుబలి తో ఒక్కసారిగా నేషనల్ వైజ్ గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఆ సినిమాలో చేసిన రిస్క్ అందర్నీ అబ్బురపరిచేవే.. అయితే తాజాగా అయన చేయబోయే చిత్రం కోసం కూడా భారీ రిస్క్ చేయబోతున్నాడట..యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించే తదుపరి సినిమా రూపొందుతుంది.ఈ చిత్రం కోసం 20 కేజీల వరకూ బరువు తగ్గవలసి ఉంటుందని దర్శకుడు చెప్పాడట.

దాంతో ప్రభాస్ వర్కౌట్స్ చేసి తన బరువు తగ్గించుకోబోతున్నాడట..గతంలో ‘బాహుబలి 2’ కోసం బాగా బరువు పెరిగిన ప్రభాస్ మళ్ళీ సన్నబడబోతున్నాడన్నమాట..బాహుబలి కోసం భారీ కండలు తిరిగిన దేహాన్ని డెవలెప్ చేశాడు ప్రభాస్ ఇప్పుడు కాస్త తగ్గించుకుని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ప్రభాస్ ఓ 15 రోజుల పాటు ఔటాఫ్ స్టేషన్ లో ఎంజాయ్ చేసి తిరిగి వస్తాడట.ప్రభాస్ తిరిగి రాగానే కసరత్తు మొదలవుతుందని చెబుతున్నారు. మే నెలలో ఈ సినిమాను మొదలుపెట్టాలనే ఆలోచనలో వున్నారు.సుజిత్ సినిమా తర్వాత.. ‘జిల్’ దర్శకుడు రాథాకృష్ణ దర్శకత్వంలోను ప్రభాస్ ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పినట్టు ఫిల్మ్ నగర్ సమాచారమ్.