నేను చేసే మహాభారతం ఆ రేంజ్ లో ఉంటుంది..!!

రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం అనేది అందరికి తెలిసిందే.. ప్రస్తుతం బాహుబలి సినిమా చేస్తున్న రాజమౌళి మహాభారతం చేయాలంటే తనకి మరో పదేళ్ల అనుభవం గతంలో కొన్ని వ్యాఖ్యలు చేసాడు జక్కన్న.. దీంతో జక్కన్న డ్రీమ్ ప్రాజెక్ట్ మరో పదేళ్ల తర్వాత కానీ చూడలేమని క్లారిటీ వచ్చేసింది.. ప్రస్తుతం బాహుబలి 2 ని ఈ ఏప్రిల్ కి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడు. రీసెంట్ గా ప్రభాస్ పార్ట్ ని పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమైన రాజమౌళి బాహుబలి మజిలీలపై ఏర్పాటు చేసిన సౌత్ కాన్‌క్లేవ్ 2017లో పాల్గొన్ని ఆ చిత్ర విశేషాలతో పాటు తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం పై స్పందించారు..

మహాభారత కథను ప్రపంచమే అబ్బురపడేలా సిల్వర్ స్క్రీన్ మీద చూపించాలన్నదే తన చిరకాల కోరిక అన్నాడు. మహాభారతం నుంచి ఓ పాత్రను తీసుకున్నా.. ఓ ఉపకథను ఎంపిక చేసుకొన్నా అవి ఎంతగానో ప్రభావితం చేస్తుందన్నారు. ఇంకా బాహుబలి గురించి మాట్లాడుతూ బాహుబలి సినిమా ప్రభావాన్ని జనం 30 ఏళ్ల తర్వాత కూడా గుర్తుంచుకోవాలన్నాడు రాజమౌళి. భాషకు, సినిమాకు సంబంధం లేదని, విజువల్సే కథను, ఎమోషన్లను ప్రేక్షకులకు చేరవేస్తాయని రాజమౌళి చెప్పుకొచ్చాడు.