రాశి ఖన్నాకి ఇదేం ఖర్మ..!!

siddharth-newc
తెలుగులో లవర్ బాయ్ గా ఓ దశకాన్ని ఏలిన హీరో సిద్దార్థ్ ప్రస్తుతం రేస్ లో వెనుకబడిపోయాడు.. యంగ్ హీరోల తాకిడితో అసలు తెలుగు సినిమాలు చేయడమే మానేశాడు.. తమిళ్లో అప్పుడప్పుడు చేసిన అవి యావరేజ్ టాక్ ని తెచ్చుకోవడం తో సిద్దార్థ్ మల్లి మొదటినుంచి మొదలుపెట్టాల్సిన పరిస్థితి.. అయితే సిద్దార్థ్ మరో ప్రయత్నం గా షైతాన్ కా బచ్చా అనే వెరైటీ టైటిల్ తో కూడిన యాక్షన్ కామెడీ చిత్రంలో నటిస్తున్నాడు..

తమిళంతో బాటు తెలుగులోనూ తీస్తున్న ఈ మూవీకి కార్తీక్ జి.క్రిష్ దర్శకుడు. ఈ చిత్రంకోసం హీరోయిన్ గా రాశి ఖన్నా ని ఎంపిక చేసారని తెలుస్తుంది..స్క్రిప్ట్ చెప్పగానే ఎంతో నచ్చి ఓకే చెప్పేసిందట. గతంలో ఈ అమ్మడికి కోలీవుడ్ లో ఆఫర్స్ వచ్చినా టాలీవుడ్ లో బిజీగా ఉండడంతో డేట్స్ ఇవ్వలేకపోయిందని..షైతాన్ కా బచ్చా సినిమాతో తమిళ సినీ రంగంలో ఛాన్స్ వచ్చినందుకు సంబరపడుతోందని అంటున్నారు. అయితే మరో పక్క కెరీర్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న నేపథ్యంలో సిద్దార్థ లాంటి అవుట్ డేటెడ్ హీరోలతో చేయడం అవసరమా అంటున్నారు అభిమానులు..