సాహోరే..సాహో షూటింగ్…!!

‘బాహుబలి’, ‘బాహుబలి-2’ చిత్రంతో జాతీయస్థాయిలో పేరొందిన నటుడు ‘ప్రభాస్’ తాజా చిత్రంతో బిజీ బిజీగా మారిపోయాడు. దాదాపు కొన్ని సంవత్సరాల వరకు ఒక్క సినిమాకే పని చేసిన ఆయన మరో చిత్రంలో నటిస్తుండడంతో భారీ అంచనాలు నెలకొంటున్నాయి.సుజీత్ సింగ్ దర్శకత్వంలో ‘సాహో’ సినిమా తెరకెక్కుతోంది. షూటింగ్ మొదలు కాకుండానే టీజర్ ను ముందుగా రిలీజ్ చేసి ఆసక్తిని రేకేత్తించారు. చాలా ఏళ్ల తర్వాత ‘ప్రభాస్‌’ తెర మీద మోడరన్‌ గెటప్‌తో కనిపించనుండడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈసినిమా వివరాలు మాత్రం ఏ మాత్రం బయటకు పొక్కడం లేదు. తాజాగా సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న మది తమిళ మీడియాతో మాట్లాడినట్లు సోషల్ మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు 7 రోజుల షూటింగ్‌ ముగిసిందని ఇంకా 180 రోజుల పాటు షూటింగ్‌ జరగాల్సి ఉందని అన్నారు. హీరోయిన్‌ ఎవరనేది దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటిస్తారని అన్నారు. రానున్న రోజుల్లో వివరాలు తెలిసే అవకాశాలున్నాయి.

LEAVE A REPLY