నయన్ కు భారీగా ఇస్తామంటున్నారట

sangamitra makers goes extra mile bring nayan onboard
sangamitra makers goes extra mile bring nayan onboard

టాలీవుడ్ ‘బాహుబలి’ కి ధీటుగా కోలీవుడ్ మీదుగా ‘సంఘమిత్ర’ ను తెరకెక్కించాలని దర్శకుడు సుందర్ సి ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. చివరకు ఎలాగైతే స్టార్ హీరోయిన్ శృతిహాసన్ ప్రధాన పాత్రకు, యంగ్ హీరోలు జయం రవి, ఆర్య లను హీరోలుగా ఫిక్స్ చేసి ఇటీవలే ప్రాజెక్టును ఫైనల్ చేశారు. అయితే, ఈ భారీ ప్రాజెక్ట్ ఇంక పట్టాలెక్కుతోంది అనుకునే టైమ్ లోనే.. పూర్తి స్క్రిప్ట్ తన చేతిలో పెట్టలేదని, షెడ్యూల్స్ గురించి క్లారిటీ ఇవ్వడం లేదని అంటూ రకరకాల కారణాలు చెబుతూ శృతిహాసన్ అందరికీ షాక్ ఇస్తూ సంఘమిత్ర నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ విషయం వివాదంగా మారేలా కనిపించినా.. ఆదిలోనే ఇంత పెద్ద ప్రాజెక్టును వివాదాల్లో నెట్టుకోవడం ఎందుకని నిర్మాతలు చేసేది లేక వేరే హీరోయిన్ కోసం వేట మొదలెట్టారని అర్థమైపోయింది.

ఈ క్రమంలో ఇప్పటివరకు కొంతమంది బాలీవుడ్ హీరోయిన్లతో పాటు మన తమన్నా, హన్సిక తదితర నాయికల పేర్లు వినిపించినా ఎవరినీ ఫైనల్ చేయలేదు. ఎందుకంటే, ఇప్పుడు సంఘమిత్ర మేకర్స్ దృష్టంతా ఈ భారీ ప్రతిష్టాత్మక సినిమాకు కరెక్ట్ గా సరిపోయే మన అనుష్క, నయనతార లపైనే ఉందట. ఈ విషయంలో డైరెక్టర్ సుందర్ ఓవైపు హన్సిక ను తీసుకుందామని పట్టుబడుతుంటే.. నిర్మాతలు మాత్రం హన్సిక వద్దంటే వద్దు అని అనుష్క, నయనతార లలో ఎవరో ఒకరిని ఫిక్స్ చేసేయాలని డిసైడ్ అయిపోయారట. అయితే, ఇటు అనుష్క ఇప్పుడు బాహుబలి ని పూర్తి చేసి తెలుగు సినిమాలే పెద్దగా ఒప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో.. రెండేళ్లు వెచ్చించాల్సిన సంఘమిత్ర కు ఓకే చెప్పే ఛాన్స్ లేదని నిర్మాతలకు తెలిసి ఫీలవుతున్నారట.

దాంతో చివరకు నయన్ కే ఫిక్స్ అయ్యారని సమాచారం. కానీ, మొదట్నుంచీ కండిషన్స్ తో భయపెట్టే నయన్ దగ్గరకు వెళ్లకూడదంటే వెళ్లకూడదని అనుకున్నారట. ఇక ఇప్పుడేమో వెళ్లాల్సిన పరిస్థితి సంఘమిత్ర మేకర్స్ కు ఉండటంతో.. నయన్ బెట్టుచేస్తుందని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అంతేకాదండోయ్.. నయన్ బెట్టు చేస్తున్నా వదులుకోలేక సంఘమిత్ర నిర్మాతలు భారీగా రెమ్యునరేషన్ ఇస్తామని బుజ్జగించే పరిస్థితికి వచ్చేశారని తెలుస్తోంది. ఈ క్రమంలో తాను ఇప్పటికే కమిట్ అయిన సినిమాలకు ఎలాంటి ఇబ్బంది రానీయకుండా సంఘమిత్ర కు కాల్ షీట్స్ కోరితే ఓకే అన్నట్లు నయన్ చెప్పినట్లు టాక్ వినిపిస్తుంది. మరి నిర్మాతలు బుజ్జగించడం.. నయన్ కండిషన్స్ అప్లై అనడం చూస్తుంటే.. ఇది సాఫీగా ముందుకు వెళుతుందా అంటే చెప్పడం కొంచెం కష్టమే.