శాతకర్ణి కి లైన్ క్లియర్..!!

నందమూరి బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. ఈ సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా, ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలని కూడా పూర్తి చేసుకొంది. సెన్సార్ సభ్యులు ఈ చారిత్రాత్మక చిత్రానికి ‘యు/ఎ’ సర్టిఫికెట్ ని జారీ చేశారు. సింగిల్ కట్ కూడా లేకుండా శాతకర్ణి సెన్సార్ సర్టిఫికెట్ ని సొంతం చేసుకోవడం విశేషం. సెన్సార్ సభ్యులు శాతకర్ణి’గా బాలకృష్ణ నటన చాలా బాగుందని చెప్పారు. విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా వచ్చాయనీ .. ఈ సినిమాను ఓ దృశ్యకావ్యంగా మలిచారని క్రిష్ టీమ్ ను అభినందించారు.

శ్రియా, హేమ మాలిని.. ప్రతి ఒక్కరు తమ తమ పాత్రలో ఒదిగిపోయి నటించారని సినిమా ఆమాంతం ఓ అద్భుతం చూస్తున్నట్టుగా సాగిందని చెబుతున్నారు. ఎక్కడా సుత్తి లేకుండా కథని సూటితా, సుత్తి లేకుండా చెప్పాడట దర్శకుడు. ఈ చిత్రం తర్వాత దర్శకుడు క్రిష్ రేంజ్ పెరిగిపోవడం ఖాయమంటున్నారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చారిత్రాత్మక చిత్రంలో బాలయ్య సరసన శ్రియా జతకట్టనుంది. తల్లిగా అలనాటి హీరోయి హేమ మాలిని కనిపించనుంది. ఈ చిత్రానికి సంగీతం చిరంతన్ భట్. వై.రాజీవ్ రెడ్డి, క్రిష్ నిర్మాతలు.