శాతకర్ణి పతాకోత్సవం..!!

నందమూరి బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఈ చారిత్రాత్మక చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా దగ్గరవుతున్న కొద్దీ ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ సినిమా ప్రమోషన్స్ విషయంలో దర్శక నిర్మాతలు కొత్తగా ప్లాన్ చేస్తున్నారు. బాలకృష్ణకి ఇది 100వ సినిమా కావడం వలన, మొదటి నుంచి కూడా 100 సంఖ్యకి ప్రాధాన్యతనిస్తూ .. కార్యక్రమాలను డిజైన్ చేస్తూ వస్తున్నారు.

అలాగే ఇప్పుడు కూడా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా, ఈ నెల 8వ తేదీన 100 థియేటర్లలో ‘శాతకర్ణి’ .. ‘పతాకోత్సవం’ జరపాలని నిర్ణయించుకున్నారు.ఇందులోభాగంగా ప్రత్యేకంగా డిజైన్ చేయించిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ జెండాను 100 థియేటర్స్ వద్ద ఆవిష్కరించబోతున్నారు. జనవరి 8న జరగనున్న ఈ పతాకోత్సవ కార్యక్రమంలో భాగంగా.. విశాఖలోని జ్యోతి థియేటర్లో జరిగే పతాకోత్సవంలో బాలకృష్ణ, దర్శకుడు క్రిష్, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ సాయి కొర్రపాటి హాజరు కానున్నారు. మిగిలిన చోట్ల బాలయ్య అభిమానులు పతాకోత్సవాన్ని నిర్వహించబోతున్నారు. ఈ వేడుక శాతకర్ణి ప్రమోషన్స్ మరోసారి పీక్స్ కి చేర్చడం ఖాయంగా కనిపిస్తోంది.